టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ చేసిన ఏ సినిమా కూడా సూపర్‌ హిట్ అనే స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పూరి జగన్నాథ్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు విజయ్‌ దేవరకొండ. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా తరువాత పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు విజయ్‌.

పూరి కూడా వరుస ఫ్లాప్‌ల తరువాత ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. అదే జోరును కంటిన్యూ చేసేందుకు రౌడీతో సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో ఉన్న విజయ్‌ దేవరకొండ ఆకట్టుకున్నాడు.

అయితే ఇటీవల లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో విజయ్‌ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ గ్యాప్‌లో లుక్‌ విషయంలో ప్రయోగాలు చేస్తున్న విజయ్‌, ఫాదర్స్‌ డే సందర్భంగా కొత్త లుక్‌ను రివీల్‌ చేశాడు. ఫ్రెంచ్‌ బియర్డ్ తో లాంగ్‌ హెయిర్‌తో ఉన్న విజయ్ దేవరకొండ లుక్‌పై ఫన్నీ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి లుక్‌తో సినిమా చేస్తే కష్టమే అంటున్నారు నెటిజెన్లు. మరి సినిమా కోసమే విజయ్‌ ఈ లుక్‌ ట్రై చేశాడా..? లేక ఖాళీగా ఉండి ట్రై చేశాడో తెలియాలంటే పూరి సినిమా సెట్స్ మీదకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.