Asianet News TeluguAsianet News Telugu

డియ‌ర్ కామ్రేడ్‌ అక్కడ పెద్ద హిట్

 విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌ తో వచ్చిన  ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు.
 

Vijay Deverakonda Dear Comrade gets love on Amazon Prime!
Author
Hyderabad, First Published Sep 3, 2019, 5:21 PM IST

 

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌ తో వచ్చిన  ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు.

జూలై 26న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్  అయిన ఈ చిత్రం హై ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైంది. కానీ మార్నింగ్ షోకే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా సందేశాత్మకంగా ఉందంటూనే బోర్ కొడుతోందన్నారు. దాంతో చాలా ఏరియాల్లో ఈ సినిమా నష్టాన్నే మిగిల్చింది. 

అయితే ఈ చిత్రం ఆగస్ట్ చివరి వారం నుంచీ అమెజాన్ ప్రైమ్ లో స్టీమింగ్ అవుతోంది. అయితే చిత్రంగా థియోటర్స్ లో వర్కవుట్ కాని ఈ సినిమా అమెజాన్ ఫ్రైమ్ లో తెగచూస్తున్నారట. అంతేకాదు వాళ్లకు తెగ నచ్చుతోందిట. ఈ విషయమై వారు సోషల్ మీడియాలో చర్చలు సైతం చేస్తున్నారు. ఇంత మంచి సినిమాని మిస్సైపోయామే అని వాపోతున్నారు. 

డియర్ కామ్రేడ్  సినిమా మంచి ఎమోషనల్ ట్రీట్‌గా ఉందని చెప్తున్నారు.   అంతేకాదు ఇంత మంచి సినిమాకు నెగిటివ్ టాక్ ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూస్తూంటే అమిజాన్ ఫ్రైమ్ లో హిట్ అయ్యే కొన్ని సినిమాలు ఉన్నాయని తేలుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios