ఈ సీజన్ లో మరో అతి పెద్ద చిత్రం సైరా. మెగా స్టార్ చిరంజీవి  నటించిన 151వ చిత్రం “సైరా నరసింహ రెడ్డి” షూటింగ్ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠత్మాకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం యావత్ ఇండస్ట్రీ మాత్రమే కాక సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నరటంలో ఆశ్చర్యం ఏమీలేదు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం వేరే పర్పస్ కోసం ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకు కారణం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన చిత్రమే అని తెలుస్తోంది. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.  ఈ చిత్రం రిలీజ్ విషయమై డెసిషన్ తీసుకునేందుకు విజయ్ దేవరకొండ ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారట.

ప్రస్తుతానికి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అక్టోబర్‌ మూడవ వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అది సైరా భాక్సాఫీస్ దగ్గర నిలబడే సిట్యువేషన్ పై ఆధారపడి ఉంటుందిట. సైరా  పెద్ద హిట్ అయితే మూడు వారాల తర్వాత తమ సినిమా తెస్తారట. అదే కనుక తేడా కొడితే వెంటనే ఆ మరుసటి వారమే మీకు మాత్రమే చెప్తా సినిమాని థియోటర్స్ లోకి దింపేందుకు సిద్దంగా ఉన్నారట. అలా కాకుండా సూపర్ హిట్ అయితే అక్టోబర్ చివరి దాకా ఆగుతారట.

 అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ తో ఈ సినిమాక మంచి క్రేజ్ వచ్చింది.  చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ సినిమా  మంచి టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది.  థియేటర్‌లో పూర్తిగా నవ్వులు పంచుతామంటూ హామీ ఇచ్చే దిసగా మూవీ టీమ్ రెడీ అవుతోంది.