Asianet News TeluguAsianet News Telugu

కామెడీ, రొమాన్స్ మాత్రమే కాదు యాక్షన్ కూడా...  ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కేక!

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ది ఫ్యామిలీ స్టార్. నేడు ట్రైలర్ విడుదల కాగా అంచనాలు మరో స్థాయికి చేరాయి. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 
 

vijay devarakonda starer family star trailer mesmerizes ksr
Author
First Published Mar 28, 2024, 12:26 PM IST


విజయ్ దేవరకొండ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు. హిట్ ఇచ్చిన దర్శకుడితో చేతులు కలిపిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. 2018లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గీత గోవిందం బాక్సాఫీస్ షేక్ చేసింది. అత్యధిక లాభాలు పంచిన చిత్రాల జాబితాలో నిలిచింది. గీత గోవిందం మూవీ విజయ్ దేవరకొండ ఇమేజ్ ని రెట్టింపు చేసింది. అయితే గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఆ స్థాయి హిట్ పడలేదు. 

ఫ్యామిలీ స్టార్ తో ఆ కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. రెండున్నర నిమిషాల  ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ మనసులు దోచేసింది. లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా జోడించారు. విజయ్ దేవరకొండ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొన్నాడు. ఇక పరశురామ్ తన మార్క్ రొమాంటిక్ సీన్స్ తో కట్టిపడేశాడు. మృణాల్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులకు ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. 

విజయ్ దేవరకొండలో రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి. ఫారిన్ ఎపిసోడ్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. మృణాల్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే పాత్ర ఏదైనా ఒదిగిపోయి నటిస్తుంది. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ మూవీని దర్శకుడు యూత్ ఇష్టపడే అంశాలతో రూపొందించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడే ఎలిమెంట్స్ ఉన్నాయి. చూస్తే ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ దాహం తీర్చడం ఖాయంగా కనిపిస్తుంది. 

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఫ్యామిలీ స్టార్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. లాంగ్ టర్మ్ లో ఫ్యామిలీ స్టార్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి... 
 

Follow Us:
Download App:
  • android
  • ios