టాలీవుడ్ లో సక్సెస్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాపై విమర్శకులు మండిపడుతున్నా.. కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి.

ఇప్పటికే 170 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండు వందల కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా జంటగా నటించిన షాహిద్ కపూర్, కియారా అద్వానీల నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు చెబుతూ కియారా అద్వానీకి ఓ గిఫ్ట్ ని ప్రెజంట్ చేశాడు. ఆ గిఫ్ట్ ని సోషల్ మీడియావేదికగా అభిమానులతో పంచుకుంది కియారా.

'కబీర్ సింగ్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ కియారా.. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్.. నా ఆనందంతో పాటు.. నా బట్టలను కూడా పంపుతున్నాను. ఇలా అంటే తప్పుగా వినిపిస్తుంది కదా.. నా బ్రాండ్ దుస్తులను పంపాను' అని తెలిపారు. గిఫ్ట్ అందుకున్న కియారా సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకి ధన్యవాదాలు చెప్పింది.