Asianet News TeluguAsianet News Telugu

ఫైనల్ కలెక్షన్స్: విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ డిజాస్టర్!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే ఈ సినిమాకు ముందు విజయ్ నుంచి తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రంగా నోటా సినిమా రిలీజైన సంగతి తెలిసిందే.

vijay devarakonda nota final collections
Author
Hyderabad, First Published Nov 20, 2018, 3:12 PM IST

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే ఈ సినిమాకు ముందు విజయ్ నుంచి తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రంగా నోటా సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. గత నెల 5న వచ్చిన నోటా బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిల్చిందని తెలుస్తోంది. 

ఫైనల్ కలెక్షన్స్ కి వస్తే.. 25 కోట్ల థ్రియేటికల్ వాల్యూ కలిగిన నోటా 12.55 కోట్ల షేర్స్ ను మాత్రమే అందించింది. తమిళనాడులో భారీ స్థాయిలో రిలీజ్ చేసినప్పటికీ కేవలం 2 కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకోగలిగింది. ఇక నైజం - ఎపిలో అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాలేవు. మొత్తంగా తెలుగు రాష్ట్రలో 7.85కోట్ల రూపాయలు షేర్స్ అందాయి. 

ఇక యూఎస్ లో గత చిత్రాలతో మంచి లాభాలను అందుకున్న విజయ్ ఈ సారి కోటి కంటే ఎక్కువ షేర్స్ అందుకోలేకపోయాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన నోటా సినిమాను కె.ఈ.జ్ఞాన్ వెల్ రాజా నిర్మించారు. 50% నష్టాలను మిగిల్చిన ఈ నోటా ఫైనల్ గా విజయ్ కెరీర్ లో ఒక డిజాస్టర్ గా నిలిచింది. ఇక విజయ్ స్పీడ్ కు ఈ సినిమా కొంచెం బ్రేక్ వేసినప్పటికీ టాక్సీ వాలాతో వెంటనే రికవర్ అయ్యాడు

Follow Us:
Download App:
  • android
  • ios