ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్రమైన కాంబినేషన్స్ సందడి చేస్తుంటాయి. త్వరలో టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోంది. ఓకప్పుడు తన సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన విజయ్ దేవరకొండ హీరోగా.. శేఖర్ కమ్మలు డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. మరి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?  

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్రమైన కాంబినేషన్స్ సందడి చేస్తుంటాయి. త్వరలో టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోంది. ఓకప్పుడు తన సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన విజయ్ దేవరకొండ హీరోగా.. శేఖర్ కమ్మలు డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. మరి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

విజయ్ దేవరకొండకు వరస పరాజయాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయినా తేరుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో.. రీసెంట్ గా శివ నిర్వాణతో ఖుషి మూవీని షూటింగ్ ను కంప్లీట్ చేసిన విజయ్.. తన నెక్స్ట్‌ సినిమాను గౌతమ్‌ తిన్ననూరితో చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనుకున్న గౌతమ్.. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఆ కథతోనే రౌడీ హీరోతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీతో త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళే యోచనల లో ఉన్నారట మేకర్స్. ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములతో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. శేఖర్‌ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ మూవీలో విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రలో నటించారు. శేఖర్‌ కమ్ములతో సినిమా చేయాలని విజయ్‌ దేవరకొండ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడని, మంచి కథ కోసం వెయిట్‌ చేశారని అంటున్నారు. 

ఇక ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబోలో సినిమాకు రూట్ క్లాయర్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ కు మంచి కథను వివరించాడట శేఖర్. వీరిద్దరి మధ్య చాలా సేపు కథా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాదు త్వరలోనే ఇంట్రెస్టింగ్ సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారట టీమ్. ఇది నిజం అయితే విజయ్ నికొత్త జానర్ లో చూడవచ్చు అనుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్. 

గత నాలుగైదు ఏళ్ల నుంచీ.. వరుస ఫెయిల్యూర్స్ విజయదేవరకొండను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ముఖ్యంగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత.. చాలా జాగ్రత్తగా.. తన కెరీర్ నుముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు విజయ్.. అందుకే గ్యాప్ నులెక్క చేయకుండా రెండేళ్ళు ఓపిగ్గా ఉండి.. టైమ్ తీసుకుని మరీ లైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన లైగర్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజైంది. కాని ఈ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ప్రపంచ తలకిందులైనట్టు అయ్యింది.

 పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయాలి అని అనుకున్నాడు. కాని అది కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్‌ చేసింది.