Asianet News TeluguAsianet News Telugu

“ఫ్యామిలీ స్టార్” బడ్జెట్ , ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు

ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు.

Vijay Devarakonda Family Star Pre-Release Business Details Jsp
Author
First Published Mar 25, 2024, 12:09 PM IST


విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే . దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన  ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ . ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది.. ఎంత బడ్జెట్ పెట్టారు వంటి విషయాలు ట్రేడ్ లో చర్చగా మారాయి.

అందుతున్న సమాచారం మేరకు... ఫ్యామిలీ స్టార్ చిత్రం మంచి థియేట్రకల్  బిజినెస్ చేసింది. 45 కోట్ల వరకూ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఇక డిజిటిల్ ఓటిటి బిజినెస్, హిందీ డబ్బింగ్ ,శాటిలైట్ రైట్స్ అదనం. డిజిటల్ రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ వారు తీసుకున్నారు. 
 
ప్రమోషన్స్ ని బట్టి ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీస్తున్నారని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ పై ఫిల్మ్ సర్కిల్స్ , మీడియాలోనూ టాక్ బయిలుదేరింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం బడ్జెట్ 50 కోట్లు దాకా ఉండవచ్చు అంటున్నారు. పబ్లిసిటి,వడ్డీలతో కలిపి మరో ఐదు కోట్లు అంటే టోటల్ గా 55 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు.  ఇదే విజయదేవరకొండ సినిమాల్లో హైయిస్ట్ బడ్జెట్ అంటున్నారు. అయితే లైగర్ చిత్రం సైతం భారీ బడ్జెట్ తో రూపొందింది. బిజినెస్ బాగా జరుగుతుందని అంటున్నారు. 

మరో ప్రక్క  ఈ చిత్రం కథ ..చిరంజీవి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడ‌ర్‌’కు పోలిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’మాదిరిగానే ఈ సినిమాలో  ఇద్ద‌రు అన్న‌ల  త‌మ్ముడిగా  విజ‌య్ కనిపిస్తారు. అలాగే గ్యాంగ్ లీడర్ లో  చిరు ఇంట్లోకి విజ‌య‌శాంతి రెంట్‌కి దిగి.. ప్రేమ‌లో ప‌డే ఎపిసోడ్ ఉంటుంది. ఇక్కడ  ఈ సినిమాలోనూ విజ‌య్ ఇంట్లో మృణాల్ అద్దెకు దిగి, ప్రేమ‌లో ప‌డుతుందని అంటున్నారు. అయితే ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో  ప్రత్యేకమైన  విల‌న్ , రివైంజ్ ఉంటంది. 

ఇక్క‌డ మాత్రం కథ మాత్రం ‘గీత గోవిందం’తరహాలో సాగుతుందని, ఆమె పైనే హీరో  సరదాగా రివేంజ్ తీర్చుకుంటాడని , ఆ క్రమంలో వచ్చే కామెడీ, ఎమోషన్ సినిమాకు సినిమాని నిలబడతాయని నమ్ముతున్నారట. ‘గీత గోవిందం’కు ఓ వెర్షన్ లా గ్యాంగ్ లీడర్ స్క్రీన్ ప్లే డిజైన్ లో సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా రెండూ సూపర్ హిట్స్ కాబట్టి ఈ సినిమా కూడా అదే స్దాయిలో వర్కవుట్ కావచ్చు. 
 
ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: వాసు వర్మ, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల.
 

Follow Us:
Download App:
  • android
  • ios