ఇళయ థళపతి విజయ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బీస్ట్`. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నేడు శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇది దూసుకుపోతుంది. 

`థళపతి` విజయ్‌(Vijay) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బీస్ట్`(Beast). నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Poja Hegde) కథానాయికగా నటించింది. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ నిర్మించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, యాక్షన్‌ ప్రధానంగా సాగే `బీస్ట్` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఉగాది పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం ఈ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్‌ ఎలిమెంట్స్ తో సాగే ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. విజయ్‌ ఫ్యాన్స్ కి ఫుల్‌ యాక్షన్‌ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. 

`బీస్ట్` ట్రైలర్‌ (Beast Trailer) ని బట్టి చూస్తే చెన్నైలోని ఓ భారీ షాపింగ్‌ మాల్‌ హైజాక్‌ జరుగుతుంది. టెర్రరిస్ట్ లు దాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. అందులోని అమాయక ప్రజలను బెదిరిస్తూ తమ కావాల్సినవి డిమాండ్‌ చేస్తుంటారు. ఎదురుతిరిగితే, నోరు ఎత్తితే కాల్చేపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతో అంతా మౌనంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండిపోతారు. ఈ క్రమంలో విజయ్‌ ఎంట్రీ ఇస్తాడు. తనదైన స్టయిల్‌లో నెమ్మదిగా ఒక్కో టెర్రరిస్ట్ ని అంతం చేస్తూ, అంతిమంగా అందరు టెర్రరిస్ట్ ల ని ఖతం చేయడం ఈ సినిమా కథగా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. 

YouTube video player

ఇందులో విజయ్‌ రాఘవన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సైనికుడు. తాను రాజకీయ నాయకుడిని కాదు, సోల్జర్‌ని అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. టెర్రరిస్ట్ ఎటాక్‌కి సంబంధించి రాజకీయాలకు సంబంధం ఏంటనే కోణంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది.మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతుంది. ఏప్రిల్‌ 13న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ టైమ్‌ విజయ్‌, పూజా హెగ్డే జోడీ కట్టడం విశేషం.