డర్టీ పిక్చర్ చిత్రం విడుదల కాక ముందు వరకు విద్యా బాలన్ క్రేజ్ బాలీవుడ్ కు మాత్రమే పరిమితం. ఆ చిత్రం విడుదలయ్యాక కూడా సౌత్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. డర్టీ పిక్చర్ చిత్రం విద్యా బాలన్ కు తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బోల్డ్ పాత్రలో అద్భుతంగా నటించిన మహిళామణి అంటూ ప్రశంసించారు. 

డర్టీ పిక్చర్ అందించిన ఉత్సాహంలో విద్యాబాలన్ బేగమ్ జాన్ అనే మరో బోల్డ్ మూవీలో నటించింది. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విద్యాబాలన్ హాలిడే పిక్స్ డర్టీ పిక్చర్ ని గుర్తు చేస్తున్నాయి. తడి అందాలతో, హాట్ క్లివేజ్ తో విద్యాబాలన్ హల్ చల్ చేస్తోంది. 

ఈ ఫోటోలని విద్యాబాలన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ ఇండోనేషియా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇలా విద్యా బాలన్ అందాలు ఆరబోయడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా విద్యా బాలన్ వివాహం తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది విద్యా బాలన్ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.