ప్రముఖ అందాల నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం..
ప్రముఖ నటుడు హరనాథ్ కూతురు పద్మజా రాజు(54)శారు. ప్రముఖ నిర్మాత జి.వి.జి రాజు భార్య అయిన పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
ప్రముఖ అలనాటి అందాల నటుడు హరనాథ్ కూతురు పద్మజా రాజు(54)శారు. ప్రముఖ నిర్మాత జి.వి.జి రాజు భార్య అయిన పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పద్మజాకి ఇద్దరు కుమారులున్నారు. ఆమె సోదరుడు శ్రీనివాస రాజు కూడా నిర్మాతనే కావడం విశేషం. పద్మజా రాజు భర్త అయిన నిర్మాత జీవీజీ రాజు.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `గోకులంలో సీత`, `తొలి ప్రేమ` చిత్రాలను నిర్మించారు.
మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `గోదావరి` చిత్రానికి కూడా ఆయనే నిర్మాత. భర్తకి అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉండేవారు ఆయన పద్మజా రాజు. ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ గురించి `అందాల నటుడు` పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ఈ నేపథ్యంలో పద్మజా రాజు మీడియాతో మాట్లాడుతూ, `త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారని తెలిపారు.
వచ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేసే పనుల్లో ఉన్న పద్మజా, ఆమె భర్త జీవీజీ రాజు బిజీగా ఉండగా, అంతలోనే ఆమె హఠాన్మరణం చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది సినీ ప్రముఖులను సైతం కలచి వేసింది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకి శాఆంతి చేకూరాలని, వారి ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.