Asianet News TeluguAsianet News Telugu

వెన్నెల కిశోర్‌ హీరోగా జేమ్స్ బాండ్‌ మూవీ.. ఆ లుక్‌ చూస్తే మెంటలే.. దించేశాడుగా..

వెన్నెల కిశోర్‌ ఇప్పుడు జేమ్స్ బాండ్‌ మూవీ చేస్తున్నాడు. గూఢచారిగా మారి ప్రత్యర్థులను అంతం చేయబోతున్నాడు. తాజాగా ఆయన లుక్‌ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది.

vennela kishore turn as hero title chari 111 release date fix arj
Author
First Published Feb 9, 2024, 1:02 PM IST

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్‌ కమెడియన్‌ వెన్నెల కిశోర్‌. ఆయన ఆల్మోస్ట్ 80శాతం సినిమాల్లో ఆయన ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే స్టార్‌ హీరోల సినిమాలన్నింటిలోనూ ఆయన కనిపిస్తుంటాడు. ఒకప్పుడు బ్రహ్మానందం లాగా,ఇప్పుడు వెన్నెల కిశోర్‌ అంతగా బిజీగా ఉంటున్నాడు. అంతే బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. అందుకే ఆయనకు ఫుల్‌ డిమాండ్‌. అయితే ఇప్పుడు ఆయన హీరోగా మారుతున్నాడు. హాస్య నటులు చాలా మంది హీరోలుగా అలరించారు. ఇప్పుడు వెన్నెల కిశోర్‌ కూడా హీరోగా తనేంటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 

అయితే వెన్నెల కిశోర్‌ ఇప్పుడు జేమ్స్ బాండ్‌ మూవీ చేస్తున్నాడు. అవును ఆయన జేమ్స్ బాండ్‌ స్టయిల్‌లో ఉండే మూవీ చేస్తున్నాడు. `చారి111` పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఇందులో ఆయన లుక్‌ కూడా జేమ్స్ బాండ్‌లాగే ఉంది. గెటప్‌ మాత్రం యధాతథంగా జేమ్స్ బాండ్‌ని దించేశాడు. దీనికి టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తుంది. ఇందులో వెన్నెల కిశోర్‌కి జోడీగా విశ్వనాథన్‌ హీరోయిన్‌గా చేస్తుంది. మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

తాజాగా `చారి111` రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. మార్చి 1న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా ఇది సాగబోతుందట. అందులో జేమ్స్ బాండ్‌ ఎలిమెంట్లని మిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది. 'చారి 111' రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి 'వెన్నెల' కిశోర్ వస్తున్నట్లు ఉంది.  

`చారి 111` ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా 'చారి' పాత్రలో వెన్నెల కిశోర్ కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ, `ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర'' అని చెప్పారు. 

చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' పాటలు విడుదల కానున్నాయి. 

'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios