Asianet News TeluguAsianet News Telugu

వెన్నెల కిషోర్ కు టైమ్ వచ్చేసింది,బంపర్ ఛాన్స్ కొట్టేసాడు

యూనివర్శల్ హీరో  కమల్‌ హాసన్‌, స్టార్  డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్  చిత్రం భారతీయుడు. లంచాలపై శంకర్ వదిలిన బ్రహ్మాస్త్రం అది. ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించింది. దాంతో చాలా గ్యాప్ తర్వాత  ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 

Vennela Kishore in director Shankar's Bharateeyudu 2?
Author
Hyderabad, First Published Nov 18, 2018, 11:16 AM IST

ఇక భారతీయుడులో వడివేలు పాత్ర చాలా పేరు తెచ్చుకుంది.  అయితే ఇప్పుడు సీక్వెల్ చేయటానికి మళ్లీ వడివేలు తీసుకురావటం శంకర్ కు ఇష్టం లేదు. ఎందుకంటే శంకర్ కు, వడివేలు కి మధ్య చాలా వివాదాలు నడిచాయి. ఈ నేపధ్యంలో వడివేలుని రీప్లేస్ చేసేలా..వెన్నెల కిషోర్ ని సీన్ లోకి తెస్తున్నట్లు సమాచారం.  అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 

తెలుగులో బ్రహ్మానందం తరువాత అంత పాపులర్ అయిన హాస్య నటుడు వెన్నెల కిషోర్. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆయనకు ప్రముఖ క్రేజీ దర్శకుడు శంకర్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందని తెలియటంతో అందరూ కంగ్రాట్స్ తెలియచేస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ మొదలైంది. వచ్చే ఏడాది మొదట్లో  లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం 180 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తమిళ సిని వర్గాల సమాచారం.  ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలై శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో టీమ్ ఉందట. శంకర్ – కమల్ కాంబినేషన్ అంటే నయనతార తప్పకుండా అంగీకరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. కమల్ తో నయనతార చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios