విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. ఆయన కుమార్తె దగ్గుబాటి అశ్రితకు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడితో వివాహం జరగనుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. 

ఇటు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు. తాజాగా అశ్రిత నిశ్చితార్ధ వేడుక ఫిబ్రవరి 6న జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వెంకటేష్ ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించారు. ఈ నిశ్చితార్దానికి అతి తక్కువ మంది బంధువులు, శ్రేయాభిలాషులు హాజరైనట్లు తెలుస్తోంది.

వీరి వివాహం మార్చి 1న జరగనుంది. అయితే వివాహం ఎక్కడ జరపాలనేది ఇంకా కుటుంబ సభ్యులు నిర్ణయించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. పెళ్లి రిసెప్షన్ ని మాత్రం హైదరాబాద్ నాన‌క్‌రామ్ గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేయనున్నారు.