Asianet News TeluguAsianet News Telugu

వెంకటేష్ ప్లానింగ్ చూస్తే.. 2019 ఆయనదే అంటారు

ఎఫ్ 2 హిట్ అవటంతో వెంకటేష్ కు ఊపు వచ్చింది. తనని ఎలా ప్రేక్షకుల చూడాలనుకుంటున్నారో క్లారిటీ వచ్చినట్లైంది.  సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 30 కోట్లకు పైగావ వసూలు చేసి ఇండస్ట్రీకు షాక్ ఇచ్చింది. 

venkatesh to go with nenu local director
Author
Hyderabad, First Published Jan 18, 2019, 10:23 AM IST

ఎఫ్ 2 హిట్ అవటంతో వెంకటేష్ కు ఊపు వచ్చింది. తనని ఎలా ప్రేక్షకుల చూడాలనుకుంటున్నారో క్లారిటీ వచ్చినట్లైంది.  సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 30 కోట్లకు పైగావ వసూలు చేసి ఇండస్ట్రీకు షాక్ ఇచ్చింది. ఈ ఎఫెక్ట్ తో మరో మూడు సినిమాలను కన్ఫర్మ్ చేసేసాడు వెంకి.  

‘నేను లోకల్‌’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సోలో  హీరోగా నటించడానికి వెంకటేశ్‌ సిద్దపడుతున్నట్లు సమాచారం. త్రినాథరావు ఓ ఇంట్రస్టింగ్  కథ చెప్పడం, వెంకీ విని సరే అనడం జరిగిపోయాయట. ప్రసన్నకుమార్ రాసిన కథ, డైలాగులతో పూర్తి ఫన్ గా ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెలాఖరుకు కానీ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ  సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్‌. అంటే.. ఈ సినిమా కూడా ఈ  ఏడాది ప్రధమార్దంలో రిలీజయ్యే అవకాశం ఉంది.  

అలాగే కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీ ‘వెంకీమామ’ అనే సినిమాలో నటిస్తారు. ఈ సినిమా  త్వరలో స్టార్ట్‌ అవుతుంది. సో.. ఈ రెండు సినిమాలు కచ్చితంగా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి వస్తాయి. అంటే ఈ సంవత్సరం మూడు సినిమాలతో వెంకటేష్ మళ్లీ ఫామ్ లోకి రాబోతున్నాడన్నమాట.

గతేడాది ‘గురు’ సినిమా తర్వాత మళ్లీ థియేటర్‌లో ప్రేక్షకులను పలకరించలేదు వెంకటేశ్‌. క్రితం సంవత్సరం ఆయన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేదు. కానీ  ఈ  ఏడాది వెంకీ సినిమాలు కనీసం మరో రెండు విడుదల అవుతాయి. ఇప్పటికే   వరుణ్‌ తేజ్‌తో కలసి ఆయన హీరోగా నటించిన ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) చిత్రం  సంక్రాంతికి విడుదల అయ్యింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios