Asianet News TeluguAsianet News Telugu

యంగ్ హీరోకి వెంకటేష్ మార్నింగ్ సర్ ప్రైజ్!

కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో వెంకీ ముందుటారు. వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్2 చిత్రం ద్వారా ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ, నాగచైతన్య కలసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. 

Venkatesh phone call to Young hero
Author
Hyderabad, First Published Jun 29, 2019, 4:29 PM IST

కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో వెంకీ ముందుటారు. వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్2 చిత్రం ద్వారా ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ, నాగచైతన్య కలసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఓ యంగ్ హీరోని వెంకటేష్ శనివారం ఉదయం సర్ ప్రైజ్ చేశాడట. ఈ సంగతిని ఆ హీరోనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 

యువ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'బ్రోచేవారెవరురా' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నివేద థామస్, సత్యదేవ్, నివేత పేతురాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. తొలి షో నుంచి ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కామెడీ,సస్పెన్స్ అంశాలు బాగా ఆకట్టుకున్నాయని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. 

దీనితో విక్టరీ వెంకటేష్ శ్రీవిష్ణుని అభినందించడానికి ఈ ఉదయం అతడికి ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని శ్రీ విష్ణు ట్విట్టర్ లో వెల్లడించాడు. ఈ ఉదయం వెంకటేష్ గారు ఫోన్ చేసి అభినందించారు. దీనితో తన సంతోషానికి అవధులు లేవని శ్రీ విష్ణు అంటున్నాడు. బ్రోచేవారెవరురా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన అభిమాన నటుడు వెంకటేష్ అని శ్రీ విష్ణు తెలిపాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios