Asianet News TeluguAsianet News Telugu

40 ఏళ్ళ క్రితం వెంకటేష్ - ఖుష్బుూ ఎలా ఉన్నారో తెలుసా..?

సీనియర్ నటి ఖుష్బూ.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా రాసుకొచ్చింది. 40 ఏళ్ళ క్రితం వెంకటేష్ తో పాటు.. తాను ఎలా ఉండేదో.. ఓ ఫోటో ద్వారా వెల్లడించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

Venkatesh and Kushboo Kaliyuga Pandavulu Movie at 38 Years JMS
Author
First Published Aug 15, 2024, 2:45 PM IST | Last Updated Aug 15, 2024, 2:45 PM IST

సీనియర్ యాక్ట్రస్ ఖుష్భూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 40 ఏళ్ళు అవుతోంది.  అల‌నాటి అందాల తారగా ఖుష్బూ సుందర్ స్టార్ డమ్ తో దూసుకుపోతయింది. తమిళ హీరోయిన్ అయినా.. తెలుగు,కన్నడ, బాష‌ల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. సౌత్ ఇండియాన్ సూపర్ స్టార్ హీరోయిన్ గా ఆమె స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.  ఇక ప్ర‌స్తుతం తల్లి పాత్రలు చేస్తూ.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా బిజీ అయిపోయింది. అంతే కాదు తమిళ  రాజ‌కీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది ఖుష్బూ.. 

ఇక వయస్సు పెరుగుతున్నా కొద్ది.. తన గ్లామర్ తో పాటు.. ఫిట్ నెస్ ను కూడా కాపాడుకుంటుంది ఖుష్బూ.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 40ఏళ్లు అయ్యింది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె అడుగు పెట్టి  స‌రిగ్గా 38 ఏళ్లు అవుతుంది.  14 ఆగ‌స్టు 1986లో ఖుష్బూ హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ  వెంక‌టేష్ హీరోగా న‌టించిన మొదటి సినిమా క‌లియుగ పాండ‌వులు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఖుష్బుూ.. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా కాగా.. వెంకటేష్ కు ఇది ఫస్ట్ సినిమా కావడం విశేషం. 

ఈ సినిమాతోనే అటు ఖుష్బూ, ఇటు వెంక‌టేష్‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇద్దరు స్టార్లకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక విశేషం ఏంటంటే.. కలియుగ పాండవులు రిలీజ్ అయ్యి... ఈరోజుతో 38 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సంరద్భంగా  ఖుష్బూ సోష‌ల్ మీడియాలో వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది.

 

ఆమె తన పోస్ట్ లో ఏం రాశారంటే.. త‌న ఫస్ట్ హీరో  హీరో వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర రావుల‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఖుష్బూ. వీరిద్దరికి  ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని ఆమె తెలిపింది. సురేష్ ప్రొడక్షన్స్ త‌న‌ను ఓ ఫ్యామిలీ మెంబర్ లా చూసకున్నారని.. అది ఎప్ప‌టికి త‌న‌ు మర్చిపోలేను అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తనకు ఎప్పటికీ  హోం బ్యాన‌రే అని  ఆమె తెలిపింది. అంతే కాదు ఈసినిమా ద్వారా తెలుగు పరిచయం అవ్వడం. అది కూడా వెంకటేశ్‌ పక్కన నటించ‌డం తన అదృష్టంగా భావిస్తున్నాని ఆమె అన్నారు. 

ఇన్నేళ్ళు అయినా.. తమ మధ్య.. స్నేహం అలాగే కొనసాగుతున్నందుకు కూడా ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. న‌న్ను కుటుంబంగా చూసుకున్నందుకు, డ్రీమ్ గ‌ర్ల్‌గా ప్రెజెంట్ చేసినందుకు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకి, చిత్ర బృందానికి, తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఖుష్బు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios