Asianet News TeluguAsianet News Telugu

#VarunTej:'ఆపరేషన్ వాలెంటైన్' బడ్జెట్ ఎంత? ఎంతకు అమ్మారు?

  వరుణ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్. వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గాండీవధారి అర్జున డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరి ఈ మూవీకి ఈరెంజ్ బిజినెస్ జరగడం ...

Varun Tej Operation Valentine has done a strong pre release business jsp
Author
First Published Feb 28, 2024, 12:14 PM IST


వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా మీదే పెట్టుకున్నారు.  ఈ సినిమా కూడా  రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.  ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడి చివరికి మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. . రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమా బిజినెస్ ఊపందుకుంది.

ట్రేడ్ వివరాలు ప్రకారం... రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్ తేజ్ మార్కెట్‌ ప్రకారం ఇది కాస్త రిస్కే. కానీ రిలీజ్‌కి ముందే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయిందని చెప్తున్నారు. ఈ  సినిమా బడ్జెట్ మొత్తాన్ని ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే రాబట్టేశారు మేకర్స్. దాంతో  సినిమా విడుదలకు ముందే మేకర్స్ ప్రాఫిట్ జోన్‌లో ఉన్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ (అన్ని భాషల్లో) రూ.26 కోట్లకి సొంతం చేసుకుంది. ఇక హిందీ హక్కులు (నాన్-థియేట్రికల్) రూ.14 కోట్లకి అమ్ముడయ్యాయి. 
అలానే ఆపరేషన్ వాలెంటైన్ మ్యూజిక్ రైట్స్ రూ. 2.6 కోట్లకి సేల్ అయ్యాయి. ఇక తెలుగు శాటిలైట్ డీల్ రూ. 6.5 కోట్లకి క్లోజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కల బట్టి ఇప్పటికే దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసేసింది మూవీ టీమ్. ఇలా నిర్మాతలు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసేశారు. ఇక థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం అంతా మేకర్స్‌కి లాభమే అని తెలుస్తోంది.

  వరుణ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్. వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గాండీవధారి అర్జున డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరి ఈ మూవీకి ఈరెంజ్ బిజినెస్ జరగడం సంచలనంగా మారింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని కూడా కలుపుకొని మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర దగ్గర 100 కోట్లు వరకు వెళ్లేలా ఉంది. సోనీ పిక్చర్స్ ఇండియా, సిద్ధు ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

నైజాం ఏరియాలో సాలార్, హను-మాన్ చిత్రాలను విజయవంతంగా పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ధరకే ఆపరేషన్ వాలెంటైన్ రైట్స్ కొన్నట్లు టాక్.   ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావటంతో మంచి ఓపినింగ్స్ వచ్చే అవకాసం ఉంది. ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడంతో మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి గెస్టుగా వచ్చారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని, వీటిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందంటూ చిరంజీవి చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే హాలీవుడ్ రేంజ్‌లో ఉందంటూ చిరు ప్రశంసించారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios