మెగాఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా అతడు నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా వరుణ్.. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షోలో పాల్గొన్నాడు.

తన జీవితంలో జరిగిన కొన్ని  విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. మీ లైఫ్ లో మొదటి ముద్దు ఎప్పుడు ఇచ్చారని మంచు లక్ష్మీ అడగగా.. 'పదో తరగతిలో ఉన్నప్పుడే మొదటి ముద్దు ఇచ్చాను.. అది నాకో చెడు జ్ఞాపకం. నాకు అంతగా గుర్తు లేదు. దాని గురించి ఏం చెప్పలేను' అని వరుణ్ తెలిపాడు.

ఫ్యాన్స్ తో ఏదైనా మర్చిపోలేని సంఘటన ఉందా..? అని అడగగా.. 'ఒకరోజు నేను హైదరాబాద్ లోని ఓ క్లబ్ కు నా స్నేహితులతో వెళ్లాను. పార్టీలో మేమందరం డాన్స్ చేస్తుండగా.. సడెన్ గా ఒక అమ్మాయి వెనుక నుండి వచ్చి హగ్ చేసుకుంది. నా ఫ్రెండ్స్ లో ఎవరో నన్ను పట్టుకున్నారని అనుకున్నా.. ఆ తరువాత ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే.. ఆ అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకొని అక్కడ నుండి వెళ్లిపోయింది. ఆ క్షణం నాకు చాలా భయం వేసింది' అని వరుణ్ చెప్పుకొచ్చాడు. తనకు ఇప్పటివరకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదని వరుణ్ చెప్పాడు.