మెగాఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ మొదటి నుండి సరికొత్త కథలను ఎన్నుకుంటూ హిట్ మీద హిట్టు అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా.. నటి మంచు లక్ష్మి తెలుగు రియాలిటీ షో 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. రెగ్యులర్ ఇంటర్వ్యూల మాదిరి కాకుండా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి ఈ షోలో ఎక్కువ ప్రశ్నిస్తుంటారు. పైగా షోలో పాల్గొనబోయే సెలబ్రిటీ నైట్ డ్రెస్ వేసుకొని మంచు లక్ష్మితో కలిసి బెడ్ మీద ఇంటర్వ్యూ ఇస్తారన్నమాట.

తాజాగా వరుణ్ తేజ్ ఈ షోలో పాల్గొన్నాడు. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ 'రాశీఖన్నా, సాయిపల్లవి, పూజా హెగ్డే ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు..? ఎవరిని చంపుతావు..? ఎవరితో డేటింగ్ కి వెళ్తావు..?' అని అడగగా.. వరుణ్ వెంటనే.. 'సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా.. రాశిఖన్నాను చంపుతా.. పూజా హెగ్డేతో డేటింగ్ కి వెళ్తాను' అని సరదాగా సమాధానం చెప్పారు.