Asianet News TeluguAsianet News Telugu

మెగా హీరో బాక్సింగ్.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే!

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

Varun Tej boxing backdrop movie will starts form August
Author
Hyderabad, First Published May 9, 2019, 4:34 PM IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాల్మికీలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి వరుణ్ తేజ్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని ఎంపిక చేసుకుంటున్నాడు. వాల్మీకి తర్వాత కూడా వరుణ్ ప్రయోగాత్మక చిత్రానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 
 
నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఆగష్టు నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో మెళుకువలను నేర్చుకునేందుకు కాలిఫోర్నియా వెళ్లి వచ్చాడు. మాజీ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రిన్ ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకున్నాడు. ఇదంతా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కోసమే. వాల్మీకి చిత్ర షూటింగ్ మే, జూన్ నెలలలో ఎక్కువ భాగం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. 
 
కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి వైజాగ్, హైదరాబాద్, ఢిల్లీ నగరాలలో కీలక షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వరుణ్ తేజ్ ఎఫ్2 రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఎఫ్ 2 తర్వాత వరుణ్ ఎంచుకుంటున్న చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. 
Follow Us:
Download App:
  • android
  • ios