నాల్గో పెళ్లికి రెడీ అయిన వనితా విజయ్ కుమార్, ప్రియుడికి ప్రపోజ్ చేస్తూ ఫోటో, అసలైన రచ్చ షురూ
వనితా విజయ్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. ఆమె నాల్గో పెళ్లికి రెడీ అవుతుందట. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ దుమారం రేపుతుంది. మరి అందులో ఏముందంటే?
ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ సినిమాల్లో కంటే పెళ్లి వార్తలతోనే బాగా పాపులర్ అయ్యింది. మ్యారేజ్ న్యూస్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమెని టచ్ చేస్తే మూడో పెళ్లి, నాల్గో పెళ్లి, ఆయనతో పెళ్లి, ఈయనతో విడాకుల అనే విషయాలే బయటకు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేసినంత ఈజీగా భర్తలను మార్చేస్తుంది వనితా విజయ్ కుమార్. ఆమె ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముగ్గురికి విడాకులు ఇచ్చింది. ఇప్పుడు నాల్గో పెళ్లికి రెడీ అవుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ దుమారం రేపుతుంది. ఇది వనితా విజయ్ కుమార్ నాల్గో పెళ్లికి రెడీ అవుతుందనేది కన్ఫమ్ చేస్తుంది.
వనితా విజయ్ కుమార్ నాల్గో పెళ్లికి సిద్ధం?
వనితా విజయ్ కుమార్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె ఓ వ్యక్తికి ప్రేమని ప్రపోజ్ చేస్తూ కనిపించింది. సముద్రపు ఒడ్డుని బీచ్‌లో ఆయనకు వనితా విజయ్ కుమార్ ప్రపోజ్ చేస్తుంది. అంతేకాదు అందులోనే అసలు వివరాలను వెల్లడించింది. వనితా విజయ్ కుమార్ లవ్ రాబర్ట్ అని పేర్కొంది. అక్టోబర్ 5 2024 అనే డేట్‌ని కూడా మెన్షన్ చేసింది. సేవ్ ది డేట్ అని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 5న ఆమె మ్యారేజ్ చేసుకోబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు దీనికి సంబంధించిన మీమ్స్, జోకులను కూడా ఆమె పోస్ట్ చేయడం విశేషం. రాబర్ట్ తో ఉన్న వీడియోని సైతం ఆమె షేర్ చేసింది. ఇది చూసి వనిత మరో పెళ్లికి రెడీ అయ్యిందనే కన్ఫమేషన్‌కి వచ్చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న వనితా ఎట్టకేలకు పెళ్లితో మళ్లీ బిజీ కాబోతుందనే కామెంట్లు చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్‌తో కొన్నాళ్లుగా డేటింగ్?
రాబర్ట్ ఎవరో కాదు కొరియోగ్రాఫర్. తమిళంలో మంచి పేరున్న కొరియోగ్రాఫర్ కావడం విశేషం. వీరిద్దరు చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారట. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లికి ముందు కూడా ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. కానీ మూడో పెళ్లి చేసుకోవడంతో ఆ రూమర్లకి ఫుల్ స్టాప్ పడింది. మళ్లీ ఇటీవల ఈ ఇద్దరు కాస్త క్లోజ్‌గా మూవ్ అవుతున్నారని సమాచారం. ఇప్పుడు ఏకంగా పెళ్లి అనే సాంకేతాలిస్తూ వనితా విజయ్ కుమార్ పోస్ట్ పెట్టడంతో అసలు రచ్చ షురూ అయ్యింది. వనితా మామూలుగా స్పీడ్‌గా లేదని, నాల్గో పెళ్లికి కూడా రెడీ అవుతుందని అంటున్నారు. నానా రకాలుగా మీమ్స్ చేస్తున్నారు. ట్రోలర్స్ రచ్చ చేస్తున్నారు.
వనితా విజయ్ కుమార్ పెళ్లి వార్త ప్రమోషన్స్ స్టంటా?
మరి ఇది నిజంగానే నాల్గో పెళ్లినా, లేక ఏదైనా ప్రమోషనల్ స్టంటా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే చాలా వరకు ఇది ప్రమోషనల్ స్టంటే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా పెళ్లి కాదని కొందరు అంటున్నారు. ఏదో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అయి ఉంటుందన్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లతో విసిగిపోయి ఉంది. మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకుంటుంది. వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారని, అందులో భాగంగానే తన పెళ్లిళ్ల టాపిక్‌ని వాడుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
`దేవి` చిత్రంలో నటించి వనితా విజయ్ కుమార్..
ఇక వనితా విజయ్ కుమార్ ఒకప్పుడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఆమె సినిమాలు చేసింది. `దేవి` సినిమాలో కీలక పాత్రలో మెరిసింది. సినిమాలో ఆమెది చాలా బలమైన పాత్ర కావడం విశేషం. కానీ ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ ఇటీవల నాల్గో పెళ్లికి రెడీ అయిన నరేష్ నటించిన సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. నరేష్.. పవిత్ర లోకేష్‌ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఆయన మూడో భార్య రమ్య రఘుపతి అభ్యంతరం తెలియజేస్తున్న నేపథ్యంలో తాను ఏ పరిస్థితుల్లో పెళ్లికి రెడీ అయ్యాను, ఎందుకు చేసుకోవాల్సి వస్తుందని, ఆమెతో ఎందుకు విడిపోవాలనుకుంటుందనేది తెలియజేసేలా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేశాడు నరేష్. ఇందులో రమ్య రఘుపతి ని తలపించే పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించడం విశేషం. ఈ సినిమా ఘోర పరాజయం చెందింది.
వనితా విజయ్ కుమార్ మూడు పెళ్లిళ్ల వివరాలు..
తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది వనితా విజయ్ కుమార్. ఇటీవల మూడు పెళ్లిళ్లు పెటాకులు అయిన తర్వాత నటిగా బిజీ అవుతున్నట్టు తెలిపింది. అంతేకాదు వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండేళ్లలోనే ఆమె ఆరేడు సినిమాలు చేయడం విశేషం. ఇలా నటనపై ఫోకస్ పెట్టిందనుకునే సమయంలోనే ఇప్పుడు మరో పెళ్లి వార్తలో చర్చనీయాంశంగా మారుతుంది. మరి నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? సినిమా చేస్తుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. వనితా పెళ్లిళ్ల విషయానికి వస్తే ఆమె 2000లో తొలిసారి ఆకాష్‌ని అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. వీరికి జోవిక అనే కూతురు పుట్టింది. ఏడేళ్లకి మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. 2007లోనే ఆనంద్ జయరాజన్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఓ కూతురు పుట్టింది. ఐదేళ్లకి అనగా 2012లో వీరు విడిపోయారు. 2000లో మళ్లీ పీటర పాల్‌ని మ్యారేజ్ చేసుకుంది. జస్ట్ రెండు మూడు నెలల్లోనే అతనికి విడాకులు ఇచ్చింది.
వనితా విజయ్ కుమార్ ఫ్యామిలీ వివరాలు..
వనితా విజయ్ కుమార్ ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు కావడం విశేషం. శ్రీదేవి కూడా వనిత చెళ్లి అనే విషయం తెలిసిందే. హీరో అరుణ్ విజయ్ సోదరులు. మిగిలిన అందరు వివాదాలకు దూరంగా ఉంటున్నారు. కానీ వనితా విజయ్ కుమార్ మాత్రం అన్ని విషయాల్లోనూ వివాదాల్లో నిలుస్తుంది. ఫ్యామిలీతోనూ గొడవలు పడి బయటకు వచ్చింది. వివాదాలతోనే పెళ్లిళ్లు చేసుకుంటూ మరింత కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలుస్తుంది వనిత.