Asianet News TeluguAsianet News Telugu

గౌతమ్ మెయిన్ లీడ్, మహేష్ కీ రోల్

మహేష్ బాబు తన చిన్నతనంలో తండ్రి కృష్ణ సినిమాల్లో కనిపించారు. తండ్రి ,కొడుకు కలిసి కొన్ని హిట్ సినిమాలు చేసారు. ఆ తర్వాత తరంలో  మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి గతంలో 1 నేనొక్కిడినే చిత్రంలో కనిపించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోయినా మంచి పేరు తెచ్చుకుంది.

Vamshi Paidpally'S NEXT WITH MAHESH AND GAUTAM?
Author
Hyderabad, First Published Sep 2, 2019, 4:22 PM IST

మహేష్ బాబు తన చిన్నతనంలో తండ్రి కృష్ణ సినిమాల్లో కనిపించారు. తండ్రి ,కొడుకు కలిసి కొన్ని హిట్ సినిమాలు చేసారు. ఆ తర్వాత తరంలో  మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి గతంలో 1 నేనొక్కిడినే చిత్రంలో కనిపించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోయినా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరో సారి ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో కృష్ణ కూడా ఓ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మూడు తరాల చిత్రం మనంలా అన్నమాట. 

ఇక ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం.  ఈ మేరకు స్టోరీ లైన్ చెప్పి మహేష్ ని ఒప్పించారు. ఆల్రెడీ మహేష్ తో వంశీ పైడిపల్లి..మహర్షి సినిమా డైరక్ట్ చేసారు. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్  అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ తో వంశీ పైడిపల్లికి బాండింగ్ బాగా పెరిగింది. దాంతో  గౌతమ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం ప్లాన్ చేసాడని, అయితే మహేష్ మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కొడుకుని కూడా మెల్లిగా అభిమానులకు దగ్గర చేసేందుకు మహేష్ చేస్తున్న ఆలోచనగా చెప్తున్నారు. 

అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. ఇదిగా ఉంటే మహేష్ కుమార్తె సితార, వంశీ పైడిపిల్ల కుమార్తె ఆద్య ఇద్దరు కలిసి  ఓ వీడియో చేసారు. వినాయిక చవితి సందర్బంగా చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios