Asianet News TeluguAsianet News Telugu

గద్దల కొండ గణేష్(వాల్మీకి) ప్రీమియర్ షో టాక్

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.  చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా వాల్మీకి టైటిల్ ను మార్చేశారు. గద్దల కొండ గణేష్ గా టైటిల్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ అమెరికాలో ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ సినిమా టాక్ పై ఓ లుక్కేస్తే..
 

Valmiki gaddala konda ganesh premiere show talk
Author
Hyderabad, First Published Sep 20, 2019, 6:11 AM IST

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.  చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా వాల్మీకి టైటిల్ ను మార్చేశారు. గద్దల కొండ గణేష్ గా టైటిల్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ అమెరికాలో ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ సినిమా టాక్ పై ఓ లుక్కేస్తే..

మెయిన్ గా వరుణ్ తేజ్ క్యారెక్టర్ సినిమాలో మరో లెవెల్ కి చేరుకుంది. రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ ఎట్రాక్ట్ చేశాడు. ఇక హరీష్ శంకర్ డైరెక్టర్ గా మరోసారి తన మాస్ ఎలిమెంట్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు. బోర్ కొట్టిస్తుంది అనేలేపే డైలాగ్స్ అలాగే పంచ్ లతో మంచి ఎనర్జీని తెప్పించాడు. 

ఇక పూజా హెగ్డే న్యాచురల్ యాక్టింగ్ తో తన రేంజ్ కి తగ్గట్టు నటించింది. ముఖ్యంగా వెల్లువచ్చి గోదారమ్మా సాంగ్ ఆమె చూపించిన హావభావాలు శ్రీదేవిని గుర్తు చేస్తాయి. ఆ పాట ఒక మంచి ఫీల్ ని కలిగిస్తుంది. వరుణ్ బాడీ లాంగ్వేజ్ ని దర్శకుడు చాలా బాగా వాడుకున్నాడు అనిపిస్తోంది. గద్దల కొండ గణేష్ గా సరికొత్త కిక్ ఇచ్చాడు. 

డైలాగ్స్ డెలివరీ అలాగే నెగిటివ్ షేడ్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. మరో హీరో అథర్వ కూడా తన మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగినా సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎపిసోడ్స్ సినిమకు ఉపయోగపడ్డాయి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ని చూసిన అనుభూతి కలుగుతుందని చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios