Asianet News TeluguAsianet News Telugu

దారుణం: కేబుల్ టీవీలో 'వకీల్ సాబ్' వేసేసారు

వాజీ కేబుల్ ఈ పైరసీకి పాల్పడిందని నిర్మాతలు ఆరోపణ. సినిమా రిలీజ్ రోజే ప్రమోషన్ పేరుతో పైరసీ క్లిప్పింగ్ లను ప్రసారం చేసేసారు. 

Vakeel Saab movie in Cable tv in Visakhapatnam jsp
Author
Hyderabad, First Published Apr 17, 2021, 10:03 AM IST

రిలీజ్ అయ్యి వారం కాకుండానే పైరసీ ప్రింట్ వచ్చేస్తోంది. దాన్ని ఎలాగూ ఆపలేకపోతున్నారు. అయితే ఆ పైరసీ ప్రింట్ లు నెట్ లేదా టెలిగ్రామ్ లో డౌన్ లోడ్ చేసుకుని సీక్రెట్ గా చూసేవారికే ఇన్నాళ్లూ పరిమితం అవుతూ వచ్చింది. డ్యామేజ్ ఉన్నా కొంతలో కొంత ..ఎంతో మంది అలా చూసేవారు ఉండరు లే..వాళ్లు ఎలాగూ థియోటర్ కు వెళ్లి ఖర్చు పెట్టే బాపతు కాదులే అని సినిమా వాళ్లు సరిపెట్టుకునేవారు. అయితే ఆ పైరసీ ప్రింట్ ని కేబుల్ టీవీలో వేస్తే ..నిజంగా ఏ వీకెండో థియోటర్ కు వెళ్లి సినిమా చూద్దామనుకుని ప్లాన్ చేసుకునేవాళ్లు ఆగిపోతారు. భారీ స్దాయిలో దెబ్బ పడుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తీసిన 'వకీల్ సాబ్' వంటి సినిమాలకు మరీను. 
 
అసలే కరోనా వైరస్ విజృంభణ తో  జనం పెద్దగా థియోటర్స్ కు రాకపోవటానికి ఉత్సాహం చూపలేదు. ఇంతలో  కేబుల్ టీవిలో సినిమా వచ్చేస్తే పైరసీ ప్రింట్ బాగోకపోయినా ఎడ్జెస్ట్ అయ్యిపోయి చూసేస్తారు. దాదాపు మూడేళ్ల  గ్యాప్ తరువాత వచ్చిన పవర్ స్టార్ మూవీకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. కానీ మూవీరూల్జ్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో 'వకీల్ సాబ్' ఫుల్ లెంగ్త్ మూవీ మొదటి రోజే ప్రత్యక్షం అయ్యింది. కలెక్షన్లపై పైరసీ ప్రభావం పడుతుందని దర్శకనిర్మాతలు అనుకునేలోగా..కేబుల్ టీవీలో వేసేసారు.  

విజయనగరం పట్టణానికి చెందిన వాజీ కేబుల్ ఈ పైరసీకి పాల్పడిందని నిర్మాతలు ఆరోపణ. సినిమా రిలీజ్ రోజే ప్రమోషన్ పేరుతో పైరసీ క్లిప్పింగ్ లను ప్రసారం చేసేసారు. అసలు సినిమాని థియేటర్ లో షూట్ చేసి పైరసీ చేయడమే పెద్ద నేరం. అలాంటింది పైరసీ క్లిప్పులను కేబుల్  ఛానల్ లో ప్రసారం చేయడం చట్టవిరుద్ధం. దీంతో ఛానల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సినిమా నిర్మాత దిల్ రాజు తరపున హెచ్.వీ.చలపతి రాజు ఫిర్యాదు చేశారు. వాజీ కేబుల్ చర్యతో సినిమా నిర్మాత లకు నష్టం కలిగిందని.. అందుకే దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. దీనిపై ఏఎస్పీ సత్యనారాయణ రావు స్పందిస్తూ వాజీ ఛానల్ లో ప్రసారం అయిన పైరసీ క్లిప్పింగ్ లపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దాదాపు ఇటువంటి పరిస్థితే ధనుష్ లేటెస్ట్ మూవీ 'కర్నన్'కి కూడా ఎదురైంది. కోలీవుడ్ లో మంచి అంచనాల నడుమ విడుదలైన ధనుష్‌ స్టారర్ ఆన్ లైన్ లో లీకైపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios