మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమవుతున్న మరో యువహీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ సోదరుడైన ఈ మెగా మేనల్లుడు ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ ని ఆకర్షించాడు. సుకుమార్ రైటింగ్స్ లో పరిచయమవుతున్న ఈ మెగా హీరో మొదటి సినిమా టైటిల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

జాలరి అనే టైటిల్ ను సినిమా కథకు తగ్గట్టుగా సుకుమార్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ లో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాలరి పాత్రలో వైష్ణవ్ తేజ్ పాత్ర ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు. 

త్వరలోనే సినిమాకు సంబందించిన మరో పోస్టర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఇక కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి సి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.