తెలంగాణ ఎన్నికల్లో మరోసారి టీఆరెస్ పార్టీ అద్భుత విజయాన్ని అందుకొని నేషనల్ రాజకీయాలకు హెచ్చరిక జారీ చేసింది. ఇక ఎంతో హడావుడి చేసిన మహాకూటమి ఊహించని అపజయాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఈ ఎలక్షన్స్ లో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. గతం 10కి పైగా అసెంబ్లీ స్థానాలను అందుకున్న టీడీపీ కేవలం 2 సీట్లకే పరిమితమయ్యింది. 

కూకట్ పల్లి - శేరిలింగం పల్లిలో టీడీపీ స్పెషల్ ప్రణాళికలతో నిర్వహించిన ప్రచారాలు ఏ మాత్రం పనిచేయలేదు. ముఖ్యంగా బాలకృష్ణ ఈ నియోజకవర్గాల్లో బిజీ బిజీగా గడిపారు. అయితే ఆ ప్రచారాలు పాజిటివ్ గా కాకుండా ఎక్కువగా నెగిటివ్ గా మారిందని రిజల్ట్ తో క్లారిటీ వచ్చేసింది. పట్టుబట్టి శేరిలింగం పల్లి నియోజకవర్గం టికెట్ (భవ్య క్రియేషన్స్ అధినేత) పైసా వసూల్ నిర్మాతకు బాలకృష్ణ ఇప్పించారు. 

అంతే కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి ఆనంద్ ప్రసాద్ కోసం ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇక ఫైనల్ గా శేరిలింగం పల్లి నియోజకవర్గంలో టిడిపి ఓటమిపాలైంది. కేవలం రెండు స్థానాల్లో  (అశ్వారావుపేట - సత్తుపల్లి) మాత్రమే విజయాన్ని అందుకుంది. ఆనంద్ ప్రసాద్ పై టీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.