Asianet News TeluguAsianet News Telugu

మ్యాజికల్ రికార్డ్.. బాహుబలి2 ని కొట్టేసింది!

ఇప్పటి వరకు ఎవరు బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయని విధంగా ఓక రికార్డ్ ను యూరి సినిమా బాధేసింది.

uri movie new record
Author
Hyderabad, First Published Feb 4, 2019, 4:14 PM IST

ఎంత పెద్ద సినిమా అయినా కూడా మొదటి వారంలోనే బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఓ క్లారిటీ ఇస్తాయి. ఆ తరువాత ఎంత వసూలు చేస్తుంది అనే దానిపై ఒక అవగాహనా వస్తుంది. బాహుబలి 2 సినిమా ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు అందని స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కలెక్షన్స్ మొదటి 30 రోజుల్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. 

అయితే ఇప్పటి వరకు ఎవరు బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయని విధంగా ఓక రికార్డ్ ను యూరి సినిమా బాధేసింది. బాహుబలి విడుదలైన 20 రోజుల అనంతరం కూడా కలెక్షన్స్ 8 కోట్లకు తగ్గలేదు. అయితే 23వ రోజు(6.35కోట్లు)  అలాగే 24వ రోజులో(6.53కోట్లు) అందుకున్న కలెక్షన్స్ ని యూరి:ద సర్జికల్ స్ట్రైక్ బీట్ చేసింది. ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయ్యింది. 

అయితే 23వ రోజు 7.80కోట్లు, 24వ రోజు 8.71కోట్లను అందుకున్న యూరి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇంత లెట్ గా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలు లేవు. యూరి కంటెంట్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా కలెక్షన్స్ 200 కోట్ల మార్క్ కి దగ్గరగా ఉంది. ఈ ఏడాది మొదటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిట్ గా యూరి నిలిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios