మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో 'అ ఆ', 'ప్రేమమ్', 'ఉన్నది ఒకటే జిందగీ' ఇలా కొన్ని చిత్రాలలో నటించింది. 

మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో 'అ ఆ', 'ప్రేమమ్', 'ఉన్నది ఒకటే జిందగీ' ఇలా కొన్ని చిత్రాలలో నటించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సరైన అవకాశాలు లేవు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పైగా ఆమె నటించిన 'తేజ్ ఐ లవ్యూ', 'హలో గురు ప్రేమకోసమే' వంటి సినిమాలకు సక్సెస్ టాక్ రాకపోవడంతో నిర్మాతలు కూడా అనుపమ వైపు పెద్దగా 
చూడడం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె కాస్త లావుగా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

రోజురోజుకి బరువు పెరిగిపోతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో అప్సెట్ అయిన ఈ బ్యూటీ గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేస్తోంది. రోజుకి ఆరు గంటల పాటు జిమ్ లోనే ఉంటుందట. ప్రస్తుతం ఈమె చేతిలో బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' సినిమా ఒక్కటే ఉంది.

ఈ సినిమా కోసం స్లిమ్ అయ్యే పనిలో పడింది. సరికొత్త లుక్ లో కనిపించి తన అభిమానులకు షాక్ ఇవ్వబోతుందని చెబుతున్నారు. మరి అనుపమ స్లిమ్ లుక్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!