విజయ్ దేవరకొండ 'నోటా' టైమ్ కి రాదా..?

First Published 12, Sep 2018, 1:14 PM IST
update on vijay devarakonda's nota movie release date
Highlights

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'నోటా'. ఈ సినిమాను అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'నోటా'. ఈ సినిమాను అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన కూడా చేసింది. దీంతో ఆ సమయానికి రావాలనుకున్న రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా వెనక్కి వెళ్లింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్ లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల సినిమా అక్టోబర్ 11న రానుంది కాబట్టి ముందు వారం రిలీజ్ అయ్యే 'నోటా'ని థియేటర్ నుండి తీసే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను అక్టోబర్ 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే 18కి వచ్చినా ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పటికీ ఎన్టీఆర్ సినిమా థియేటర్ నుండి తీసే ఛాన్స్ లేదు.

తక్కువ థియేటర్లు దొరికినా పర్వాలేదని అక్టోబర్ 18నే 'నోటా'ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అదే డేట్ న తమిళంలో విశాల్, ధనుష్ ల సినిమాలు విడుదలకు ఉన్నాయి. దీంతో ఫస్ట్ వీక్ బెటర్ అని నిర్మాతకు సూచిస్తున్నా.. ఆయన మాత్రం అక్టోబర్ 18నే విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు దిల్ రాజు సినిమా 'హలొ గురు ప్రేమకోసమే' ఇబ్బందుల్లో పడుతుంది. 'నోటా' డేట్ మారుస్తుండడంతో ఇప్పుడు దిల్ రాజు కిందా మీదా అవుతున్నట్లు సమాచారం. 

loader