Asianet News TeluguAsianet News Telugu

ఫుల్లుగా కెలికేశారంటున్నారు, నిజమైతే నమస్కారమే!

కొన్ని పెద్ద సినిమాలకు రూమర్స్ హైప్ తీసుకొస్తే...చిన్న సినిమాలకు అవే దెబ్బకొడుతూంటాయి. 

update on oh baby movie
Author
Hyderabad, First Published Jun 8, 2019, 1:31 PM IST

 

కొన్ని పెద్ద సినిమాలకు రూమర్స్ హైప్ తీసుకొస్తే...చిన్న సినిమాలకు అవే దెబ్బకొడుతూంటాయి. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి సినిమా గురించిన వార్తలు సినిమాపై ఉన్న క్రేజ్ ని తగ్గించే పనిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో చేసే చర్చలు, కామెంట్స్ తో రిలీజ్ కాకుండానే  సినిమా పరువు తీసేస్తున్నాయి. ఓ బేబి   సినిమాని ఫుల్లుగా కెలికేసారంటూ వార్తలు మొదలయ్యాయి. అందుకు కారణం సురేష్ బాబు మాట్లాడిన మాటలు కూడా ఓ కారణం.

సురేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ..ఓ ఏడు బాషల్లో ఆల్రెడీ ఈ సినిమాను తీశారు. అన్ని చోట్లా సినిమా సూపర్ హిట్. కాకపోతే రివ్యూల్లో మాత్రం మైనస్ పాయింట్స్ అని కొన్ని మెన్షన్ చేశారు. అలా ప్రతీ బాషలోనూ మైనస్ పాయింట్లను తీసుకుని, వాటిని సరిచేసుకుంటూ ఈ సినిమా తీసినట్లు నిర్మాత సురేష్‌ బాబు తెలియజేశారు. ఇది విన్నవాళ్లంతా అంటే  ఒరిజినల్ స్క్రిప్టుని ఫెరఫెక్షన్,నేటివిటీ అంటూ ఫుల్లుగా కెలికేశారనమాట అని కామెంట్స్ చేస్తున్నారు. 

అందుకు ఉదాహరణగా ..ఈ మధ్య కాలంలో రిలీజైన  ఎబిసిడి, ఫలక్నుమా దాస్ వంటి రీమేక్  సినిమాలని ఏకరవు పెడుతున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలిపడ్డాయ్. ఒరిజనల్ లో ఉన్న కథను ఏదో ఇంప్రూవ్ చేసి అదరకొట్టాలనే  తాపత్రయంతో అసలు కథలో ఉన్న ఆత్మను అంతం చేసేసారు.   దాంతో  సురేష్‌ బాబు కూడా, సినిమాను తెలుగోళ్ల కోసం మార్పులు చేర్పులు చేశాం అని చెప్పగానే కెలికేసారు..ఇంకేముంది అంటున్నారు. 

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే  ఎలా ఉంటుందనే చిన్న ఐడియాతో ఈ మూవీ వస్తోంది. రకరకాల హంగులతో ముస్తాబైన ఓహ్ బేబి, మిస్ గ్రాని అనే కొరియా సినిమాకు 8వ రీమేక్. జూలై 5న తెలుగు రాష్ట్రంలలో సినిమా విడుదలవ్వనుంది.
 
 ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించనుండగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ . 

Follow Us:
Download App:
  • android
  • ios