నటుడు అల్లరి నరేష్.. రవితేజ హీరోగా నటిస్తోన్న 'డిస్కోరాజా' సినిమాలో ఓ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ముందుగా ఆ పాత్ర కోసం సునీల్ ని అనుకున్నారని కానీ ఫైనల్ గా అల్లరి నరేష్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు సునీల్ నే ఉంచే అవకాశాలు ఉన్నాయని టాక్. వివరాల్లోకి వెళ్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ కి పెద్దగా గుర్తింపు రాకపోవడం, అదే సమయంలో 'మహర్షి' సినిమాలో అల్లరి నరేష్ క్లిక్ అవ్వడంతో సునీల్ స్థానంలో నరేష్ ని తీసుకుందామని దర్శకుడు వి.ఐ. ఆనంద్ అనుకున్నారట. 

ఇంకా ఆ విషయం కన్ఫర్మ్ కాకముందే వార్తలు బయటకి పొక్కాయి. అయితే హీరో రవితేజ మాత్రం సునీల్ వైపే మొగ్గుచూపుతున్నారట. ఆ పాత్రలో సునీల్ అయితేనే సూట్ అవుతాడని రవితేజ భావిస్తున్నాడు.

హీరోని కాదని అతడికి వ్యతిరేకంగా దర్శకుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి దాదాపు సునీల్ నే ఫైనల్ చేయబోతున్నారని సమాచారం. ఈ  విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.