మెగాస్టార్‌ కోడలు, హీరో రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన ఇటీవల `యుఆర్‌లైఫ్‌` అని పేరుతో ప్రతి ఆదివారం కొత్త వంటకాలను పరిచయం చేస్తున్నారు. సమంతతో కలిసి సహజమైన వంటలను రుచిచూపిస్తున్నారు. 

ఉపాసన తాజాగా బోల్డ్ కామెంట్‌ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన బెస్ట్ ఫ్రెండ్‌ ఒకరు ట్రాన్స్ జెండర్‌ అని పేర్కొంది. ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని ఉపాసన చెప్పారు. అంతేకాదు పూజ నుంచి దేవి ఫోటోలను తీసేయాలని తెలిపారు. ఉపాసన ఇలాంటి ఊహించని విధంగా స్పందించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

వ్యాపారవేత్త అయినప్పటికీ సింపుల్‌ లైఫ్‌ని ఇష్టపడే ఉపాసన ఇటీవల చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే.