07:14 PM (IST) Oct 09

డబ్బుల కోసం గౌతమ్ ని కాకా పడుతున్న యష్మి!

బిగ్ బాస్ హౌస్లో హోటల్ టాస్క్ షురూ అయ్యింది. ఓజీ క్లాన్ హోటల్ స్టాఫ్ కాగా.. రాయల్ క్లాన్ సభ్యులు గెస్ట్స్. వారికి సేవలు అందించి ఇంప్రెస్ చేసి స్టాఫ్ డబ్బులు రాబట్టాలి. అబ్బాయిలు త్వరగా కరిగిపోతారని భావించిన యష్మి.. గౌతమ్ ని లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

07:10 PM (IST) Oct 09

హోటల్ టాస్క్ లో మణికంఠకు రోహిణి సీరియస్ వార్నింగ్!

ఆరవ వారం కంటెస్టెంట్స్ కి హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రాయల్ క్లాన్ సభ్యులు గెస్ట్స్ కాగా... ఓజీ క్లాన్ హోటల్ స్టాఫ్. గెస్ట్స్ ని ఇంప్రెస్ చేసి వారి దగ్గర నుండి హోటల్ స్టాఫ్ డబ్బులు రాబట్టాలి. సర్వీస్ సరిగా లేదని రోహిణి అసహనం వ్యక్తం చేస్తుంది. నాగ మణికంఠ ఆమెపై సెటైర్ వేయడంతో నిజంగా సీరియస్ అయ్యింది. 
 

YouTube video player

06:06 PM (IST) Oct 09

మణికంఠను హౌస్ మేట్స్ టార్గెట్ చేశారా? టార్గెట్ అయ్యారా?

నాగ మణికంఠ బిగ్ బాస్ హౌస్లో సింపతీ గేమ్ ఆడుతున్నాడనే వాదన మొదటి నుండి ఉంది. అదే సమయంలో మణికంఠను కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారా? లేక మణికంఠ గేమ్ కి ఇతర కంటెస్టెంట్స్ టార్గెట్ అయ్యారా? అనే సందేహం కూడా ఉంది. దీనిపై ఆదిత్య ఓం ఓ స్పష్టత ఇచ్చాడు.... 

Scroll to load tweet…
04:20 PM (IST) Oct 09

లేటెస్ట్ ఓటింగ్ రిజిల్ట్స్, గంగవ్వ రాక్స్, ఆ కంటెస్టెంట్స్ కి షాక్

బిగ్ బాస్ సీజన్ 8 ఆరవ వారానికి విష్ణుప్రియ, యష్మి, పృథ్విరాజ్, గంగవ్వ, మెహబూబ్, సీత నామినేట్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం గంగవ్వ టాప్ లో ఉందట. ఇక సీత, పృథ్విరాజ్ డేంజర్ జోన్లో ఉన్నారట. 

ఓటింగ్ లో విష్ణుప్రియకు షాక్, దూసుకుపోతున్న గంగవ్వ, డేంజర్ జోన్లో ఆ ఇద్దరు!

11:42 AM (IST) Oct 09

మణికంఠ బండారం బయటపెట్టిన సిస్టర్, సంచలనంగా లేటెస్ట్ కామెంట్స్

మణికంఠ బిగ్ బాస్ హౌస్లో సింపతీ గేమ్ ఆడుతున్నాడనే వాదన ఉంది. ఫ్యామిలీని ఉద్దేశించి మణికంఠ చేసిన కొన్ని కామెంట్స్ లో నిజం లేదని ఆమె సిస్టర్ తేల్చారు. తల్లి దహన సంస్కారాల కోసం అడుక్కునే స్థితిలో మేము లేమని ఆమె అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. 

Scroll to load tweet…
10:32 AM (IST) Oct 09

అవినాష్ చేసిన పనికి గౌతమ్ ఫైర్, నేను వెళ్ళిపోతా అంటూ బిగ్ బాస్ కి రిక్వెస్ట్

కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో నవ్వు కంట్రోల్ చేసుకోవాలి. అమ్మాయిలంతా ఒక టీం. ఈ టీమ్ కి అవినాష్ లీడర్. ఇక అబ్బాయిల టీమ్ కి రోహిణి ప్రాతినిధ్యం వహించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. గౌతమ్ ని నవ్వించే క్రమంలో అవినాష్ ''అశ్వద్ధామ 2.0 వచ్చాడు'' అని గట్టిగా అరిచాడు. సీజన్ 7 ప్రస్తావన తేవడం గౌతమ్ కి నచ్చలేదు. అవినాష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.    

YouTube video player

09:17 AM (IST) Oct 09

బిగ్ బాస్ హౌస్లో సిగరెట్స్ తాగుతున్న లేడీ కంటెస్టెంట్

బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిలు కూడా సిగరెట్స్ తాగారు, కానీ అది చూపించరని ఎలిమినేట్ అయిన సోనియా వెల్లడించింది. ఒక అమ్మాయి ప్రెషర్ లో ఉన్నప్పుడు సిగరెట్ తాగుతాను అంటే, వద్దని నేను ఆపానని సోనియా అన్నారు. బిగ్ బాస్ షోలో సిగరెట్స్ తాగుతున్న ఆ లేడీ కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ మొదలైంది. 

06:28 AM (IST) Oct 09

ఓటింగ్ లో ఎవరు టాప్?

ఆరవ వారానికి గాను రాయల్ క్లాన్ నుండి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యాడు. మరోవైపు ఓజీ క్లాన్ నుండి సీత, విష్ణుప్రియ, పృథ్వి, యష్మి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. సింపతీ కారణంగా గంగవ్వ టాప్ లో ఉండే అవకాశం కలదు