ఎన్టీఆర్ ఇంగ్లీష్ యాసపై ట్రోల్స్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన తారక్..
గోల్డెన్ గ్లోబ్ అవార్దుల వేడుకలో పురస్కారం వచ్చిన సందర్భంగా అమెరికన్ మీడియాతో ఎన్టీఆర్ ముచ్చటించారు. `వెరైటీ` మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ వాహ్ అనిపించారు. అయితే అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ యాసని ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్స్ చేశారు కొందరు నెటిజన్లు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా సత్తా చాటుతుంది. మొన్నటి వరకు ఇండియాకే పరిమితమైన దీని క్రేజ్ ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా పాకింది. అక్కడ అవార్డుల పంట పండిస్తుంది. ఇప్పటికే ఇది `నాటు నాటు` పాటకిగానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని దక్కించుకుంది. మరోవైపు లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేష్ పురస్కారం దక్కింది.
అంతేకాదు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ విభాగంలో ఉత్తమ చిత్రంగా క్రిటిక్ ఛాయిస్ అవార్డుని `ఆర్‌ఆర్‌ఆర్` సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. ఆస్కార్ కోసం రెండు అడుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. అందులో `ఆర్‌ఆర్‌ఆర్` దర్శకత్వం, యాక్టింగ్, ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీలో ఉంది. వీటిలో ఏఏ విభాగాల్లో నామినేట్ కాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 25తో దీనిపై క్లారిటీ రానుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇది నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒక్కసారి నామినేట్ అయ్యిందంటే ఇక ఆస్కార్ పక్కా అనే టాక్ ఉంది.
అయితే ఇటీవల లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్దుల వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితోపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, శ్రీవల్లి పాల్గొన్నారు. అయితే ఈ పురస్కారం వచ్చిన సందర్భంగా అమెరికన్ మీడియాతో ఎన్టీఆర్ ముచ్చటించారు. `వెరైటీ` మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ వాహ్ అనిపించారు. అమెరికన్ యాక్సెంట్(యాస)లో తారక్ ఇరగదీశాడు. వామ్మో ఇదెక్కడి మాస్ రా మావ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. యంగ్ టైగర్ ఈ రేంజ్‌లో అమెరికన్ యాసలో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే నోరెళ్లబెట్టి చూడటం ఇతరుల వంతైంది. అంతేకాదు ఆ మీడియా ప్రతినిధి బర్త్ డేకి చిన్న గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు తారక్. దీంతో ఆయన ఫిదా అయిపోయారు.
అయితే అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ యాసని ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్స్ చేశారు కొందరు నెటిజన్లు. ఇది పెద్ద చేసిందని చెప్పొచ్చు. తాజాగా దీనిపై తారక్ రియాక్ట్ అయ్యారు. డైరెక్ట్ గా దీనిపై ఆయన కామెంట్ చేయలేదుగానీ, పరోక్షంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఊహించని సమాధానంతో దిమ్మతిరిగేలా చేశారు. `మేం కేవలం టైమ్ జోన్‌లో, కొంచెం యాసతో విభజించబడ్డాం, అది ఒక్కటి పక్కన పెడితే పశ్చిమంలో ఒక నటుడు వెల్లే ప్రక్రియ, తూర్పులో వెళ్లే ప్రక్రియ ఒక్కటే` అని తెలిపారు. ఆస్కార్‌ని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేశారు.
ఇక ఇందులో రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్ గురించి తారక్ మాట్లాడుతూ, రాజమౌళి తెలుగులో లేదంటే ఇండియాలో మాత్రమే సినిమాలు తీయడం ఇష్టం లేదని నేను ఎప్పుడూ భావించాను. తన చిత్రాలతో ప్రపంచాన్ని చుట్టివచ్చే అరుదైనన విషయాలలో ఆయన ఒకడు. ప్రతి సినిమాతో మెరుగుపడ్డాడని నేను భావిస్తున్నా. `ఆర్‌ఆర్‌ఆర్`ని వెస్ట్ కి తీసుకెళ్లాలనేది ఆయన ప్లాన్. ఇందులో మేం గర్వపడే విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలోని, టాలీవుడ్ అనే కచిన్న పరిశ్రమకి చెందిన `ఆర్‌ఆర్‌ఆర్` అనే సినిమాతో గ్లోబల్ సినిమాకి ద్వారాలు తెరిచి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకు రాగలిగారు. ఆ విషయంలో మేం చాలా హ్యాపీగా ఉన్నాం` అని తెలిపారు తారక్.