Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోని 'తాత' అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకరైన నటుడు అజిత్ కి కోలీవుడ్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా హీరోలు తమ తెల్ల జుట్టుని తెరపై చూపించడానికి ఇష్టపడరు. యాభై, అరవై ఏళ్లు దాటిన హీరోల జుట్టు కూడా నల్లగా మెరిసిపోతుంటుంది.

trolling on ajith
Author
Hyderabad, First Published Sep 29, 2018, 3:43 PM IST

దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకరైన నటుడు అజిత్ కి కోలీవుడ్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా హీరోలు తమ తెల్ల జుట్టుని తెరపై చూపించడానికి ఇష్టపడరు. యాభై, అరవై ఏళ్లు దాటిన హీరోల జుట్టు కూడా నల్లగా మెరిసిపోతుంటుంది.

కానీ అజిత్ వారందరికీ భిన్నం. తన జుట్టుకి రంగు వేయకుండా.. తెల్ల జుట్టుతోనే తెరపై కనిపిస్తుంటాడు. అజిత్ నటించిన 'వీరం','వేదాలం' సినిమాలలో అదే లుక్ తో కనిపించారు. అయితే ఈ మధ్య అతడి లుక్ మరీ ఘోరంగా తయారైందని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

అజిత్ నటిస్తోన్న 'విశ్వాసం' సినిమా ఫస్ట్ లుక్ లో అజిత్ రెండు పాత్రల లుక్స్ చూపించారు. ఒక పాత్రకు సంబంధించి తెల్ల జుట్టుతో కనిపించాడు. ఆ గెటప్ కి సంబంధించి తాజాగా ఓ కొత్త లుక్ ని విడుదల చేశారు. అందులో అజిత్ మరీ వయసైపోయిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.

అతడి శరీరం కూడా సరైన ఫిజిక్ లేకుండా సాధారణంగా కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్.. అజిత్ ని తాత అంటూ అతడి ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు!

Follow Us:
Download App:
  • android
  • ios