Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్‌పై ప్రయోగానికి సిద్ధపడుతున్న త్రివిక్రమ్‌.. ఇద్దరికీ రిస్కే?

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ స్టోరీ, బడ్జెట్‌ వివరాలు లీక్ అయ్యాయి.

trivikram will experiment on allu arjun with their next movie ? arj
Author
First Published Nov 26, 2023, 7:12 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాలంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, డీసెంట్‌ కామెడీ, క్లాసీగా యాక్షన్‌ ఉంటుంది. ఇంటిళ్లిపాదు కలిసి చూసేలా బంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తారాయన. అప్పుడప్పుడు యాక్షన్‌ డోస్‌ కూడా పెంచుతారు. అది కథ డిమాండ్‌ మేరకే వెళ్తారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో విజయాలు సాధించిన చిత్రాలన్నీ ఇలాంటి ఫ్యామిలీ ఎమెషన్స్ ప్రధానంగా సాగే ఎంటర్టైనింగ్‌  సినిమాలే. 

ప్రస్తుతం మహేష్‌బాబుతో `గుంటూరు కారం` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో తనని తాను కొంత మార్చుకుంటున్నాడు త్రివిక్రమ్‌. ఊరమాస్‌ ని ట్రై చేస్తున్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ  సంక్రాంతికి ఈ మూవీ రాబోతుంది. అనంతరం ఆయన అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. 

బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇది నాల్గో సినిమా. ఇప్పటికే `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` చిత్రాలు చేశారు. హ్యాట్రిక్‌ హిట్‌ సాధించారు. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ `పుష్ప2`లో నటిస్తున్నారు. ఆగస్ట్ వరకు ఈ సినిమాకే పరిమితం. ఆ తర్వాత బోయపాటి శ్రీ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని, అనంతరం త్రివిక్రమ్‌ మూవీ ప్రారంభం కానుందని సమాచారం. 

ఇదిలాఉంటే అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ స్టోరీ, బడ్జెట్‌ వివరాలు లీక్ అయ్యాయి. ఈ మూవీ సోషియో ఫాంటసీగా ఉంటుందని ఇటీవల నిర్మాత బన్నీ వాసు తెలిపారు. గతంలో త్రివిక్రమ్‌.. మహేష్‌తో ఫాంటసీ యాక్షన్‌ కామెడీగా `ఖలేజా` చిత్రాన్ని రూపొందించారు. ఇది నిరాశ పరిచింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసుకుంటూ వచ్చారు. 

ఇప్పుడు బన్నీపై ప్రయోగం చేయబోతున్నారట. పూర్తి స్థాయిలో సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నారట.  భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని, దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది రెండు భాగాలుగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మహేష్‌తో చేసిన ఫాంటసీ మూవీ `ఖలేజా` బెడిసికొట్టింది. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో బన్నీపై అలాంటి ప్రయోగం చేయబోతుండటం గమనార్హం. 

త్రివిక్రమ్‌ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెట్టింది పేరు, అదే ఆయన బలం. బంధాలు, అనుబంధాలను నమ్ముకుని ఆయన సినిమా చేసి హిట్‌ అందుకున్నారు. కానీ అది కాకుండా మరోసారి ప్రయోగం చేయడమనేది బన్నీ ఫ్యాన్స్ ని కలవర పెడుతుంది. ఇది ఇటు బన్నీకి, అటు త్రివిక్రమ్‌కి రిస్కే అంటున్నారు. మరి ఏం జరుగుతుంది, త్రివిక్రమ్‌ ఏం చేస్తాడనేది చూడాలి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్‌ చేస్తున్న `గుంటూరు కారం` చిత్రం సంక్రాంతికి జనవరి 12న విడుదల కాబోతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios