Asianet News TeluguAsianet News Telugu

మహేష్ కోసం త్రివిక్రమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. 

trivikram to direct mahesh babu
Author
Hyderabad, First Published May 4, 2019, 2:20 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరూ కలిసి 'ఖలేజా' సినిమా చేశారు. ఆ సినిమా వెండితెరపై కంటే బుల్లితెరపై పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ చాలా మంది ఆ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమా మహేష్ కామెడీ యాంగిల్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబోలో ఇప్పుడు మూడో సినిమా రాబోతుందని అంటున్నారు.మహేష్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ కూడా ఆరాటపడుతున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ యాడ్ ఫిలిం షూటింగ్ చేశారు.

ఆ సమయంలో త్రివిక్రమ్.. మహేష్ కి ఓ లైన్ చెప్పాడట. అది మహేష్ కి బాగా నచ్చిందని సమాచారం. కాకపోతే ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ ముందుగా బన్నీ సినిమా పూర్తి చేయాలి. చిరంజీవితో ఓ కమిట్మెంట్ ఉంది.

ఆ తరువాత మహేష్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరోపక్క మహేష్.. అనీల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. అలానే కొత్త కథలు కూడా వింటున్నాడు. అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాదిలో మహేష్, త్రివిక్రమ్ ల సినిమా ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios