గుంటూరు కారం ఈవెంట్ లో త్రివిక్రమ్ మరోసారి తన చమత్కారం చూపించారు. చాలా తక్కువ టైమ్ మాట్లాడినా.. తన మార్క్ స్పీచ్ తో అదరగోట్టారు. 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. శ్రీలీల జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన సినిమా గుంటూరు కారం. ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గుంటూరు లోని నంబూరులో ఘనంగాజరిగింది. ఈ ఈవెంట్ లో మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీలీల, మీనాక్షీ, తమన్ తోపాటు మూవీ టీమ్ అంతా పాల్గోన్నారు. మహేష్ అభిమాన సందోహం మధ్య అదరిపోయ స్పీచ్ ఇచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబును ప్రశంసల్లో ముంచెత్తారు. 

ఈ సినిమాలో మహేష్ బాబు అద్భుతంగా నటించారన్నారు త్రివిక్రమ్. సూపర్ స్టార్ మహేష్ చాలామంచి మనసున్నవారని. ఆయన తండ్రిగారు సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమా చేసే అవకాశం రాకపోయినా.. మహేష్ తో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగాభావిస్తున్నా అన్నారు. అంతే కాదు అతడు, ఖలేజా సినిమాల టైమ్ లో కృష్ణగారితో మాట్లాడానన్నారు. ఆయన ఎంత మంచివారో..ఆయన లెగసీని కంటీన్యూ చేస్తున్న మహేష్ అంతకంటేమంచివారు అన్నారు. 

కృష్ణ గారికొడుకుగా ఆయనచేయలేని అడ్వెంచర్ లు తాను చేయడానికి రెడీగా ఉనంటారు. మహేష్ బాబులో ఏ మార్పు జరగలేదన్నారు త్రివిక్రమ్. అతడు సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నాడో.. ఖలేజా సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారన్నారు. దాదాపు 20 ఏళ్ళుగా చూస్తున్నా.. అప్పుడు తనతో సినిమా చేసనిప్పుడు ఎలా అయితే ఎనర్జీతో ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఒక సినిమా కోసం 100 శాతం హీరో పనిచేయాల్సి వస్తే.. . 200 పర్సంట్ కష్టపడే హీరో ఎవరైనా ఉన్నారంటే.. మహేష్ గారు మాత్రమే. 

25 ఏళ్ళు అని అందరే అంటారు కాని.. రెండు మూడేళ్ల క్రితం లాంచ్ అయిన హీరోలా ఫ్రెష్ గా ఉంటారు మహేష్. ఆయన నటన కూడా అంతే యవ్వనంగా కొత్తగా ఉంటుంది. ఈ గుంటూరు కారం సినిమాలో మహేష్ గారిని డిఫరెంట్ గా చూస్తారు. కృ)ష్ణ గారి తరపున మహేష్ బాబువెనక మీరు ఎప్పుడూ ఉంటారు.. ఉండాలని కోరకుంటున్నారు. ఈనెల 12న థియేటర్లలో కలుసుకుందాం.. ఈసంక్రాంతిని అందరు సంతోషంగా జరుపుకుందాం.. రమణగాడితో కలిసి జరుపుకుందాం... అన్నారు త్రివిక్రమ.