త్రివిక్రమ్ గత కొంతకాలంగా ఎన్టీఆర్ తో తాను చేయబోయే స్క్రిప్టు కు సంభందించిన వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ కరోనా టైమ్ ని ఆయన తన స్క్రిప్టులో మరిన్ని అద్బుతమైన ఎలిమెంట్స్, ఎపిసోడ్స్ రెడీ చేసుకోవటానికి వినియోగించుకున్నారు. అలవైకుంఠపురములో వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో తనపై ఎన్ని అంచనాలు ఉంటాయో ఆయనకు తెలుసు. అయితే ఎన్టీఆర్ తో సినిమా లేటు అయ్యేటట్లు ఉంది. 

ఎన్టీఆర్ తాను రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసుకుని త్రివిక్రమ్ దగ్గరకు రావాలి. ఓ ప్రక్కన ఆర్ ఆర్ ఆర్ ...కరోనా భయంతో వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటోంది. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ ఈ గ్యాప్ ని వెంకీ తో సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ వెంకటేష్ సైతం ఇప్పుడిప్పుడే షూటింగ్ లు పెట్టుకోలేనని చెప్పేసారు. ఇలా అందరూ ప్రక్కకు తప్పుకుంటున్న సమయంలో ఈ సినేరియా మొత్తం గమనిస్తున్న హీరో రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ సీన్ లోకి వచ్చినట్లు సమాచారం. 

స్రవంతి రవికిషోర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి, సినిమాలు చేసిన వారిలో రవికిషోర్ ఒకరు. అయితే త్రివిక్రమ్ డైరక్టర్ అయ్యాక...రామ్ తో సినిమా చేయటం మాత్రం కుదరలేదు. ఈ నేపధ్యంలో రామ్ తో సినిమా చేయమని రవికిషోర్ రీసెంట్ గా త్రివిక్రమ్ ని కలిసి కోరినట్లు సమాచారం. అయితే తన దగ్గర ఉన్న స్క్రిప్టులు ఏవీ యాక్షన్ ఇమేజ్ కు టర్న్ అయిన రామ్ కు సరిపడేవి లేవని, త్వరలోనే మంచి స్టోరీ లైన్ అనుకుని ప్లాన్ చేద్దామని త్రివిక్రమ్ చెప్పినట్లు సమాచారం.