Asianet News TeluguAsianet News Telugu

#Trisha : త్రిషని రేప్ చెయ్యాలని ఉందిట, గట్టిగానే కౌంటర్ ఇచ్చింది

ఈ వీడియో త్రిష దృష్టికి రావ‌డంతో ఆమె మండిప‌డ్డారు. దేవుడి ద‌య వ‌ల్ల‌ అలాంటి వ్య‌క్తితో ఇప్ప‌టివ‌ర‌కు తాను న‌టించ‌లేద‌ని..త‌న‌ను క‌ల‌లు కంటే క‌న్నాడు కానీ ఇక ముందు సినిమాల్లో కూడా అత‌నితో క‌లిసి న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. .

Trisha describes actor as bad, vows to never work with him jsp
Author
First Published Nov 19, 2023, 6:15 AM IST


మన్సూర్ అలీ ఖాన్ మరోసారి నోరు పారేసుకున్నాడు. గతంలో తమన్నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ఆయన ఇప్పుడు త్రిషను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే తమన్నాలా త్రిష ఊరుకోలేదు. కాస్త గట్టిగా,ఘాటుగానే స్పందించింది. నోటికొచ్చినట్లు వాగద్దన్న విధంగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ మన్సూర్ ఏమి వాగాడు..త్రిష ఎలా కౌంటర్ ఇచ్చిందో చూద్దాం. 

 విజయ్, త్రిష కాంబినేషన్‌లో వచ్చి మూవీ ‘లియో’లో ఓ పాత్ర పోషించాడు మన్సూర్. ఆ సినిమా హిట్ అయ్యిన  నేపథ్యంలో ఓ ఛానల్‌తో మాట్లాడుతూ త్రిషను ఉద్దేశించి కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. 'నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూమ్ సన్నివేశం ఉంటుందని భావించాను. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని భావించాను. నేను గతంలో చాలా సినిమాల్లో రేప్ సీన్లు చేశాను, ఇది నాకు కొత్త కాదు. అయితే లియో కాశ్మీర్ షెడ్యూల్‌లో సెట్స్‌లో అసలు త్రిషను నాకు చూపించనే లేదు’అంటూ వెకిలి నవ్వులు నవ్వేశాడు. ఈ వ్యాఖ్యలపై అనేక మంది రెస్పాండ్ అయ్యారు. మన్సూర్‌పై దుమ్మెత్తిపోశారు. సోషల్ మీడియాలతో ఈ వీడియో వైరల్ అయ్యింది.  దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. తాజాగా త్రిష స్పందిస్తూ తీవ్రంగా ఖండించింది..‘అవమానకరంగా, స్త్రీద్వేషంతో కూడిన అసహ్యకరమైన మాటలుగా, జుగుప్సాకరంగా ఉన్నాయి’ అని పేర్కొంది.

 తన సోషల్ మీడియాలో “మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా మరియు అసహ్యంగా మాట్లాడిన ఇటీవలి వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది సెక్సిస్ట్, అగౌరవం, స్త్రీ ద్వేషం కనిపిస్తున్నాయి. అతను కోరుకుంటూనే ఉంటాడు, కానీ అతని లాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇంతకాలం పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. ఇలాంటి నీచ‌మైన మెంటాలిటీ ఉన్న వారు మ‌గ‌జాతికే మ‌చ్చ తెస్తార‌ని  ఆమె పేర్కొంది. 

గ‌తంలో కూడా న‌టి త‌మ‌న్నాపై (tamanna) ఇలాంటి కామెంట్స్ చేసి వైర‌ల్ అయ్యారు మ‌న్సూర్. త‌న సినిమాలో ఎలాంటి అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు లేక‌పోయినా సెన్సార్ బోర్డు చాలా క‌ట్స్ ఇచ్చింద‌ని కానీ జైల‌ర్ (jailer) సినిమాలోని కావాల‌య్యా (kavalayya) పాట‌లో త‌మ‌న్నా అన్నీ విప్పి చూపిస్తే మాత్రం సెన్సార్ బోర్డు దానిని ఓకే చేసిందని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు.  ఇలాంటి దరిద్ర‌మైన స్టెప్పులు త‌మ‌న్నా వేసిన‌ప్పుడు సెన్సార్ బోర్డు వాటికి ఎలా ఒప్పుకుంది అని మీడియా ముందు వ్యాఖ్యానించారు. మ‌న్సూర్ ఇలా ఎందుకు అన్నారంటే.. ఆయ‌న న‌టించిన కొత్త సినిమా స‌ర‌కులో (saraku) సెన్సార్ బోర్డు చాలా క‌ట్స్ ఇచ్చింద‌ట‌. మ‌రి త‌మ‌న్నా పాట‌లో అంత అశ్లీల‌త ఉంటే సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంది అని ప్ర‌శ్నించారు. మన్సూర్ వ్యాఖ్య‌ల‌ను త‌మ‌న్నా అభిమానులు ఖండించారు. సెన్సార్ బోర్డుతో స‌మ‌స్య‌లు ఉంటే దానికి త‌మ‌న్నా ఏం చేస్తుంద‌ని నిల‌దీసారు. వెంట‌నే త‌మ‌న్నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios