Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోని అరెస్ట్ చేయాలని హిజ్రాల డిమాండ్!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.

Transgenders demand arrest of Vijay Sethupathi
Author
Hyderabad, First Published Apr 3, 2019, 1:55 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'సూపర్ డీలక్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించాడు. తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమాలో విజయ్ క్యారెక్టర్ డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేస్తుంటాడు. అయితే ఈ సన్నివేశాల పట్ల హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

తమను 'సూపర్ డీలక్స్' సినిమాలో తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి హిజ్రా సంఘాలు. తమకు విజయ్ సేతుపతిపై మంచి అభిప్రాయం ఉండేదని, కానీ ఆయన ఈ సినిమాలో నటించి, దాన్ని నాశనం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

సినిమాలో విజయ్ పిల్లలని కిడ్నాప్ చేశారని, అలాంటి పనులు మేం ఎప్పుడైనా చేశామా..? అంటూ ప్రశ్నించారు. సినిమా స్క్రిప్ట్ విన్న తరువాత విజయ్ నటించానని చెప్పాల్సింది అంటూ మీడియాతో కొందరు హిజ్రాలు అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios