మలయాళ పరిశ్రమలో ఓ వింత వివాహం చోటు చేసుకుంది. మలయాళ నటి ట్రాన్స్‌వుమెన్‌ ఎలిజబెత్‌ హరిని చందన పెళ్లి చేసుకున్నారు. ఆమె తన చిరకాల ప్రేమికుడు సునీష్‌ను బంధు మిత్రుల మధ్య వివాహం చేసుకున్నారు.  

ఆధునిక యుగంలో ఏదైనా సాధ్యమే. ప్రేమకు కుల మతాలు, ధనిక పేద, జాతి బేధాలు లేవని కొందరు నిర్మిస్తున్నారు. ఐతే ప్రేమకు లింగ బేధాలు లేవని అది కూడా ట్రాన్స్ జెండర్ అయినా పర్లేదని కొందరు అంటున్నారు. మలయాళ పరిశ్రమలో ఇలాంటి ఓ వింత వివాహం చోటు చేసుకుంది. మలయాళ నటి ట్రాన్స్‌వుమెన్‌ ఎలిజబెత్‌ హరిని చందన పెళ్లి చేసుకున్నారు. ఆమె తన చిరకాల ప్రేమికుడు సునీష్‌ను బంధు మిత్రుల మధ్య వివాహం చేసుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కేరళలోని ఎర్నాకులమ్‌ బీటీహెచ్‌ హాల్‌లో ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మలయాళ సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌, ట్రాన్స్‌జెండర్‌ రెంజు రెంజిమార్‌ వధువు తల్లి స్థానంలో నిలబడి తంతును పూర్తి చేశారు. ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేసే దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ "తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను. నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను. భగవంతుడికి కృతజ్ఞతలు" అని ఆమె భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. 

జన్మతః అబ్బాయి అయిన హరిని చందన 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్‌ అందాల పోటీలో ఆమె సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 'దైవత్తింటే మనవట్టి' అనే మలయాళ హిట్‌ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో నటుడు జయసూర్య ముఖ్యపాత్రలో కనిపించారు.

View post on Instagram