ఎఫైర్స్ అనేవి జన సామాన్యంలో చాలా కామన్ విషయాలుగా మారిపోయాయి. ఎప్పుడెవరి ఎఫైర్ బయిటపడుతుందో తెలియని పరిస్దితి. అప్పటిదాకా జెంటిల్మెన్ అనుకున్న వాళ్లు హఠాత్తుగా ఈ ఎఫైర్స్ బయిటపడగానే వికృతంగా మిగతావాళ్లకు కనిపిస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది ఓ యంగ్ డైరక్టర్ విషయంలో.

వివాహం చేసుకున్న ఆ యంగ్ డైరక్టర్ కు విపరీతమైన అమ్మాయిల పిచ్చిట. మొదట్లో బాగానే ఉండేవాడు..బుద్ది మంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎవరన్నా చిన్న మందు బాటిల్ గిప్ట్ గా ఇస్తానన్నా కుడా నాకు అలవాటు లేదని తప్పుకుని వెరీ గుడ్ పర్శన్, నైస్ పర్శన్ అనిపించుకున్నాడు. సదరు డైరక్టర్ గారు ఓ రెండు హిట్స్ రాగానే తన అసలు రూపం బయిటపెడుతున్నారట.

తన సినిమాలో నటించబోయే హీరోయిన్స్ ని మెల్లిగా ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తున్నాడట. అంతేకాక తన సినిమాలో రెండు సార్లు రిపీట్ చేసిన ఓ హీరోయిన్ తో కొంతకాలం రిలేషన్ లో కూడా ఉన్నాడట. ఇంట్లో గొడవలు అవ్వటంతో సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడట. అయితే పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితూ ఎవరూ చూడటం లేదని అనుకున్నట్లుగానే తనను ఎవరూ గమనించటం లేదనట్లుగా సెట్ లో హీరోయన్స్ అతి గౌరవం ఒలకబోసేవాడట.

అయితే తనకు ఓ పెద్ద హీరోతో ఆఫర్ వచ్చింది కాబట్టి తన సినిమాలో ఛాన్స్ కావాలంటే ..అంటూ ఓ హీరోయన్ దగ్గర దీర్గం తీసేసరికి ఈ గుట్టు రట్టైందిట. ఆమె రచ్చ రచ్చ చేసిందిట. ఇంతకీ ఎవరా డైరక్టర్ అంటే ..తెలుగులో వరస హిట్స్ దూసుకుపోతున్న దర్శకుడు. అతను ఓ కుర్ర డైరక్టర్. ఇంతకు మించి క్లూలు ఇవ్వలేం.