ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు పని చేస్తే అదే స్థాయిలో గుర్తింపు కూడా వస్తుందని భావిస్తారు. కానీ కొన్ని సార్లు పని విషయంలో స్వేచ్చ ఉండదు. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి కేరింగ్ ఎక్కువై దర్శకుడు, హీరో, నిర్మాత ఇలా ప్రతీ ఒక్కరూ డైలాగ్స్ విషయంలో ఏదొక సలహా ఇస్తూనే ఉంటారు.

ఆ పద్ధతి చాలా మంది రచయితలకు నచ్చదు. ఇప్పుడు ఓ టాప్ డైలాగ్ రైటర్ పరిస్థితి కూడా ఇదేనని సమాచారం. రీసెంట్ గా ఆయన ఓ భారీ సినిమాకి పని చేశారు. అది రిలీజ్ కి సిద్ధంగా ఉంది. డైలాగ్స్ రాయడంలో ఈ రైటర్ కి మంచి పట్టు ఉంది.

ఇండస్ట్రీలో కూడా ఆయనకి మంచి పేరుంది. అయినా సరే తన పనిని సవ్యంగా చేసుకోనివ్వకుండా అందరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందట. దీంతో అంత పెద్ద సినిమాకి పని చేశాననే ఆనందం లేకుండా పోయిందని తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నాడట. ఈ సినిమా ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా తనను రాయనివ్వలేదని వాపోతున్నాడట. గతంలో కూడా ఈ రైటర్ ఇదే హీరో సినిమాకి రచయితగా పని చేశాడు.

అప్పుడు కూడా పరిస్థితి ఇదేనట. దీంతో హీరోపై, దర్శకుడిపై ఈ రైటర్ గుర్రుగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. పైగా ఇటీవల సినిమాకి సంబంధించిన విడుదల చేసిన టీజర్, ట్రైలర్లలో వినిపించిన డైలాగ్స్ లో ఫైర్ లేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు టాప్ రైటర్ మరింత ఆవేదన చెందుతున్నాడు. తన పనిని సవ్యంగా చేసుకునే స్వేచ్చ ఇచ్చి ఉంటే ఈరోజు ఇలాంటి కామెంట్స్ వచ్చేవి కాదని మరింత బాధపడుతున్నాడట.