Asianet News TeluguAsianet News Telugu

గుర్రపుస్వారీ చేస్తున్నసమంత, నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగిందా..?

లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని లెక్క చేయకుండా ..హ్యాపీగా తను అనుకున్ పని అనుకున్నట్టు సాధిస్తోంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందంటే..? 

Tollywood Senior Heroine Samantha Enjoying Horse Riding JMS
Author
First Published Jan 30, 2024, 11:22 AM IST

సినిమాలకు ఏడాదిపాటువిరామం ప్రకటించిన సమంత.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఒక వైపు తన మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరోవైపు తను అనుకున్ దేశాలు.. తను చూడాలి అనుకున్న ప్లేస్ లు చూసి వచ్చింది. హెల్త్ పరంగానే కాకుండా మెంటల్ గానూ సస్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది సామ్. టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ సాధించిన సమంత..  స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాల తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది బ్యూటీ. 

తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలో సినిమాలు చేసింది సమంత. ముఖ్యంగా తెలుగు,తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసింది. ఈరెండు ఇండస్ట్రీలతో స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది.స్టార్ హీరోలస సరసన నటించి మెప్పించింది. సినిమాలకు విరామం ప్రకటించే ముందు చివరిగా తెలుగులో ఖుషి సినిమా చేసింది సమంత.  

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత సమంత వెకేషన్స్ తో బిజీగా మారిపోయింది.  ఒక వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరోవైపు వరుసగా తనకు నచ్చిన ప్రదేశాలు చూస్తూ.. తన పెట్స్ తో ఆడుకుంటూ.. ఫ్రెండ్స్ తో టూర్లు వేస్తూ.. గడిపేస్తోంది.  ఎక్కడికి  వెళ్లినా..  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యాస్తమయ సమయంలో ఆమె గుర్రంపై స్వారీ చేస్తున్న దృశ్యం వైరల్ అవుతోంది. అయితే సమంత అనుకున్న ఏడాది సమయం అయిపోవడంతో.. తన నెక్ట్స్ సినిమా కోసం ఆమె  గుర్రపు స్వారీ చేయడంలో శిక్షణతీసుకుంటుంది అని అంటున్నారు నెటిజన్లు. అయితే అసలు విషయం మాత్రం తెలియాల్సి ఉంది. సమంత నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో  కూడా క్లారిటీ రావల్సి ఉంది. ఆమె ఇంత వరకూ ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలదేని తెలుస్తోంద.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios