Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున నా సామిరంగా ఓటీటీ డేట్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది కింగ్ నాగార్జున్ నా సామిరంగ సినిమా. మరి స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు..? ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైరిలీజ్ కాబోతోంది...? 

Tollywood King Nagarjuna Naa Saami Ranga Ott Release Update JMS
Author
First Published Jan 31, 2024, 10:17 AM IST

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడ్డాడు కింగ్ నాగార్జున.  నాత్ తో పాటు చైతన్య, అఖిల్ సినిమాలు కూడా ప్లాప్ లుగా నిలవడంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక చాలాకాలం తర్వాత టాలీవుడ్ మన్మథుడి ఖాతాలో ఒక్క హిట్టు పడింది. దాంతో ప్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.  ఘోస్ట్ మూవీ తర్వాత అక్కినేని నాగార్జున పని అయిపోయింది అనుకున్నారు కొంత మంది. కాని తన సత్తా ఏంటో నా సామిరంగ సినిమాతో చూపించుకున్నాడు కింగ్. మునుపటికంటే నవయవ్వనంతో కనిపించి షాక్ ఇచ్చాడు. 

ప్రముఖ కొరియోగ్రఫన్  విజయ్ బిన్ని దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈసారి పండక్కి ఫ్యామిలీ అడియన్స్ అంతా చూడగలిగే సినిమాల్లో ఒకటిగా నిలిచింది నా సామిరంగ సినిమా.  ఫ్యాన్స్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించాడు నాగ్. అంతే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ సాధించింది మూవీ. 

మీడియాం బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా.. మొదటి రోజే 5 కోట్లు వసూళ్ళు సాధిచింది. సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, సైంధవ్ చిత్రాలతో పోటీ పడి మరీ బ్రేక్ ఈవెన్ సాధించింది. విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీతో మరోసారి నాగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.  కన్నడ భామ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లర్ హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో  అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమిండ్ డేట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుడగా.. వారికి గుడ్ న్యూస్ వచ్చింది. 


 కొద్దిరోజులుగా నా సామిరంగ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏరోజు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను వచ్చే నెలలో అనగా ఫిబ్రవరి 15 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజో రేపో ప్రకట వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios