Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ ఫోన్ లాక్కున్న విశ్వక్ సేన్, తిరుమలలో మాస్ కా దాస్ హల్ చల్..

ఇదివరకు సెలబ్రిటీలకు ఆటోగ్రాఫ్ ల ఇబ్బందులు ఉండేవి. కలనీయకుండా చేసేవారు ఫ్యాన్స్.. ఇప్పుడు సెల్ఫీల గోల పెరిగిపోయింది. స్టార్స్ ఇబ్బందులు గమనించకుండా సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు అభిమానులు. ఈక్రమంలోనే యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ అభిమానికి షాక్ ఇచ్చాడు. 

Tollywood Hero Vishwak Sen and Gaami Team Visit Tirumala Tirupati JMS
Author
First Published Mar 14, 2024, 10:23 AM IST

సినిమా సెలబ్రిటీలు కనిపిస్తే.. సెల్ఫీల కోసం ఇబ్బండిపెట్టడం చూస్తూనే ఉన్నాం. సెల్ఫీల పేరుతో కొంత మంది కేటుగాళ్ళు.. స్టార్స్ ను ఏం చేస్తారు అనేది.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నథ్ ఓ సందర్భంలో చెప్పారు. అందుకే  బాలకృష్ణ లాంటి స్టార్స్ అభిమానులను కంట్రో ల్ చేయడానికి చేయి చేసుకుంటుంటారు. ఇక కాస్త కోపం ఎక్కువగా ఉన్న విశ్వక్ సేన్ లాంటివారు కూడా తమ మార్క్ చూపిస్తూ.. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈక్రమంలో  తిరుమలలో విశ్వక్ సేన్ చేసిన పని ప్రస్తుతం  వైరల్ అవుతోంది. 

మాస్ దాస్ విశ్వక్ సేన్ రీసెంట్  చేసిన సినిమా  ‘గామి. ఎప్పుడు ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే విశ్వక్. ఈసారి కూడా ప్రయోగమే చేశాడు. గామి సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్... డిఫరెంట్ గెటప్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.  విశ్వక్ జోడీగా  చాందిని చౌదరి నటించగా.. అభినయ, ఉమా, మహమ్మద్ సమద్ పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ఈసినిమా ముందు నుంచే మంచి అంచనాలతో రిలీజ్ అయ్యింది. అంచనాలు తగ్గట్టే రిజల్ట్ కూడా చూపించింది. 

మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ లోనే సినిమాపై హైప్ గట్టిగా క్రియేట్ చేశారు టీమ్.  ట్రైలర్ అండ్ టీజర్ తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అండ్ టేకింగ్ చూపించడంతో మూవీ పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ తరువాత ఈసినిమా  బాక్స్ ఆఫీస్ హిట్టు అనిపించుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు బాట పట్టింది.దీంతో మూవీ టీం ఫుల్ ఖుషిలో ఉంది. ఈ ఆనందంలోనే విశ్వక్ సేన్, చాందిని చౌదరి తో పాటుగా మూవీ  టీం అంతా తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఇక అక్కడ విశ్వక్, చాందిని చూసిన ఆడియన్స్ సెల్ఫీలు తీసుకోవడానికి గుంపులుగా ఎగబడ్డారు. స్టార్స్ ను కాస్త ఇబ్బందులకు గురి చేశారు. 

ఈక్రమంలోనే కొందరు యువకులు విశ్వక్ తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా.. విశ్వక్ వారి చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు. ఆ అభిమాని తన ఫోన్ ఇవ్వమని అడుగుతుంటే.. ‘నాకు గిఫ్ట్ గా ఇచ్చానని అనుకో’ అంటూ కాసేపు అతడిని ఆట పట్టించారు. ఆ తరువాత మరో అభిమాని ఫోన్ ని కూడా అలాగే లాగేసుకున్నారు. అయితే చివరికి మళ్ళీ ఆ ఫోన్స్ ని వారికీ తిరిగి ఇచ్చేసారు. ఇలా స్టార్స్ ను ఇబ్బందిపెడుతున్న అభిమానులకు తన స్టైల్ లో ఇచ్చిపడేశాడు విశ్క్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios