Asianet News TeluguAsianet News Telugu

కష్టాల్లో ఉన్న నటి పాకీజాకు మంచు విష్ణు సాయం.. సోషల్ మీడియాలో వెల్లడించిన నటి

కష్టాలలో ఉన్న తమిల కమెడయిన్ పాకీజా కు టాలీవుడ్ నుంచి వరుసగా సహాయం  అందుతుంది. కోలీవుడ్ లో ఆమెను పట్టించుకోవడం లేదు అంటూ వాపోయిన వాసుకికి తెలుగు తారలు వరుసగా చేయూతను అందిస్తున్నారు. 
 

Tollywood Hero Manchu Vishnu Help tamil Comedian Pakiza
Author
First Published Mar 17, 2023, 11:18 AM IST

సినిమావాళ్ల రోజులన్నీ ఒకేలా ఉండవు.. కోట్లకు కోట్టు సంపాదించి.. విలాసాలలో మునిగి తేలిన వారు ఆతరువాత కఠిక దరిద్రంతో జీవితాన్ని ముగించినవారు ఎందరో.. ఇప్పటికీ చాలా మంది తారలు వందల్లో సినిమాలు చేసి.. వచ్చిన డబ్బును నిలుపుకోలేక ఇబ్బందుల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కమెడియన్ పాకీజా అలియాస్ వాసుకి  కూడా ఒకరు. కుటుంబ కష్టాలతో ఉన్న డబ్బును పొగోట్టుకుని.. తిండికి కూడా లేకుండా ఇబ్బందులో ఉన్న ఆమె.. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కష్టాలు వెల్లడించారు. తమిళ తారలు ఎంత మందిని అడిగినా సాయం చేయడం లేదంటూ.. ఆమె వాపోయారు. 

ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన టాలీవుడ్ స్టార్స్ ఆమెకు ఒక్కొక్కరుగా సాయం అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో మా అధ్యక్షుడు.. టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా పాకీజాకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. పాకీజా  ఆమె పరిస్థితికి చెలించిన చాలా మంది నటులు తమ చేతనైన సాయం చేశారు.  మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే  లక్ష రూపాయలు సాయం చేసి మరోసారి తన దానగుణాన్ని చాటుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం లక్ష సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు. ఇక  తాజాగా పాకీజాకు సాయం మంచు విష్ణు. 

మంచు విష్ణు తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ పాకీజాకి అందించనున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో1. లక్ష రూపాయలు ఉండేది. కానీ ప్రస్తుతం దానిని 10 వేలు  తగ్గించి 90 వేలు చేశారు. ఇప్పుడు ఈ అసోసియేషన్ కు కట్టాల్సిన 90 వేల రూపాయలను మంచు విష్ణు పాకీజా తరపున చెల్లించి ఆమెకు కార్డు ఇవ్వబోతున్నాడు. ఈ విషయంలో మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలిపారు కరాటే కళ్యాణి. 

 

ఇక నటి పాకీజా.. అసెంబ్లీ రౌడీ సినిమాలో బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మోహన్ బాబు సినిమాల్లో ఆమె ఎక్కువగా పాత్రలు చేశారు. ఈక్రమంలో ఆమెకు మోహన్ బాబుకూడా సాయం చేస్తానని అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తూ.. కాస్త బిజీ అయ్యారు పాకీజా. ప్రస్తుతం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి..ఇక్కడే ఉంటున్నారు వాసుకీ. కష్టాల్లో ఉన్న తమిళ నటిని ఆదుకున్న మన టాలీవుడ్ నటుల మంచి మనసుకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.. కామెంట్ల రూపంలో మెచ్చుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios