Asianet News TeluguAsianet News Telugu

తండ్రైన డైరెక్టర్ వశిష్ట, ఆడపిల్లకు జన్మనిచ్చిన దర్శకుడి భార్య

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఒక్క సక్సెస్ తోనే మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసిన వశిష్ట రీసెంట్ గా తండ్రి అయ్యాడు. 

Tollywood Director Vasishta blessed baby girl Viral News JMS
Author
First Published Feb 7, 2024, 10:43 AM IST

టాలీవుడ్ లోకి హీరోగా ఎంటర్ అయ్యి.. దర్శకుడిగా మారాడు యంగ్ స్టార్ వశిష్ట. తండ్రి నిర్మాత కావడంతో ఈయన కూడా ప్రేమలేఖ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో  దర్శకుడుగా మారి ఇండస్ట్రీకి వచ్చారు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నాడు. ఆ ఒక్క సినిమాతోనే  మెగాస్టార్ నే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు వశిష్ట.  బింబిసారా సినిమాతో దర్శకుడిగా పరిచయ్యి.. ఆ సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించాడు యంగ్ డైరెక్టర్.  కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా  అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వశిష్టను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వచ్చాయి. అంతే కాదు  ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా నిలవబోతోంది. 2025  జనవరి 10న సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించేశారు కూడా.అంతే కాదు ఈమూవీలో హీరోయిన్ గా త్రిష నటించబోతుంది. 

ఇన్ని గుడ్ న్యూస్ ల మధ్య వశిష్ట జీవితంల మరో గుడ్ న్యూస్ వచ్చింది.  డైరెక్టర్ వశిష్ట తండ్రి అయ్యారు. వశిష్ట (Vasishta) భార్య సుజాత సోమవారం సాయంత్రం ఆడపిల్లకు జన్మనిచ్చారని తెలుస్తుంది. ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన రాలేదు కానీ  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios